బాలీవుడ్ యంగ్ బ్యూటీ విజయ్ దేవరకొండ పై ఈమధ్య వరసగా చేస్తున్న కామెంట్స్ చాలందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల రోజుల క్రితం 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను ఏదైనా ఒకరోజు మేల్ యాక్టర్‌గా నిద్రలేవాల్సి వస్తే తాను విజయ్ దేవరకొండ రూపాన్ని ఎంచుకుంటాను అని చెప్పి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
జాహ్నవి కపూర్
ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాహ్నవి మళ్ళీ విజయ్ దేవరకొండ ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏ హీరోని చూస్తే క్రష్ కలుగుతుంది పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది అన్న ప్రశ్నకు ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా జాహ్నవి విజయ్ దేవరకొండ పేరు చెప్పి మరొకసారి అందరికీ షాక్ ఇచ్చింది. 
అవకాశం వస్తే వదలదేమో...
అంతేకాదు ‘గీత గోవిందం’ చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ తనను మాయ చేసిందని అంటూ ఆపాటను తాను చాల సార్లు రిపీటేడ్ గా విన్న సందర్భాన్ని గుర్తుకు చేసుకుంది.  దీనితో త్వరలో జాహ్నవి విజయ్ దేవరకొండతో ఎదో ఒక బాలీవుడ్ సినిమాలో నటించడం ఖాయం అన్న సంకేతాలు ఇస్తోంది జాహ్నవి. 

అయితే తనకు విజయ్ దేవరకొండ పై క్రష్ ఉన్నంత మాత్రాన తాను విజయ్ తో సినిమాలు ఖచ్చితంగా నటిస్తానని చెప్పలేనని అంటూ తన జీవితంలో ఏవిషయం తాను అనుకున్నట్లు జరగడం లేదు అంటూ మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రస్తుతం జాహ్నవి విజయ్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో విజయ్ అభిమానులు జాహ్నవి కామెంట్స్ విని జోష్ లోకి వెళ్ళిపోతున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: