కలర్స్ స్వాతి అంటే తెలియని వారు ఉండరు. టీవీ ప్రోగ్రామ్ ద్వారా తెరకు పరిచయమై.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి.. పాపులర్ అయిన హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో చెప్పుకోదగిన సినిమాలే చేసింది స్వాతి. ఆ మధ్య ఓ పైలెట్‌ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి నటనకు దూరంగా ఉంది.

colors swathi కోసం చిత్ర ఫలితం


కానీ.. తాజాగా ఆమె ఓ టీవీ ఛానల్‌ కు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా వార్తల‌్లోకి వచ్చింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఓ సెక్స్ వీడియో తనను కొన్నాళ్లపాటు కలవరపెట్టిందంటూ పాత జ్ఞాపకం నెమరువేసుకుంది.

సంబంధిత చిత్రం


తాను కలర్స్ ప్రోగ్రామ్స్ చేసే రోజుల్లో తన ఫోన్‌కి ఓ మెస్సేజ్ వచ్చిందని.. ఆ వీడియోలో సెక్స్ చేస్తున్న అమ్మాయికి తన పోలికలు ఉన్నాయని వివరించింది. పన్నుపై పన్ను ఉండటం కలర్స్ స్వాతి ప్రత్యేకత. ఆ వీడియోలో అమ్మాయికి కూడా పన్నుపై పన్ను ఉందట.

సంబంధిత చిత్రం


అప్పట్లో ఆ సెక్స్ వీడియోలో ఉన్నది కలర్స్ స్వాతియే అని అంతా భావించారట. తన చుట్టూ ఉన్నవాళ్లే తన గురించి గుసగుసలు చెప్పుకోవడం బాధించిందట. ఆ తరవాత అంతా నిజం తెలుసుకున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: