మెగా బ్రదర్ నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తున్న కామెంట్స్ నిన్న ఎన్టీఆర్ బయో పిక్ పై వేసిన సెటైర్ల తో క్లామాక్స్ కు చేరుకుంది. దీనితో ఇప్పటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కనిపించిన నందమూరి మెగా అభిమానుల వార్ ఇప్పుడు ఛానల్స్ ప్రసారం చేస్తున్న చర్చా కార్యక్రామాలలోకి కూడ చొచ్చుకుపోయి ఏకంగా ఈ విషయం పై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేసే స్థాయికి చేరిపోయింది.
what about nagababu voice
ఇలాంటి పరిస్థుతులలో మొదట్లో నాగబాబు సెటైర్లను ఎంజాయ్ చేసిన పవన్ వీరాభిమానులు కూడ నాగబాబు అత్యుత్సాహం పై పెదవి విరుస్తున్నట్లు టాక్. ఎలాంటి సెటైర్లు అయినా మొదట్లో వినడానికి బాగుంటాయని అయితే అదేపనిగా పెట్టుకుని ఒక ప్రముఖ వ్యక్తిని టార్గెట్ చేస్తూ తరుచు కామెంట్స్ చేస్తూ ఉంటే ఆ కామెంట్స్ వల్ల ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందని పవన్ అభిమానులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనితో పవన్ అభిమానులు నాగబాబును తన స్పీడ్ తగ్గించమని కోరుతూ సందేశాలు పంపుతున్నట్లు సమాచారం. అంతేకాదు నాగబాబు ప్రస్తుతం చేస్తున్న ఈ అతి వల్ల పవన్ ఓటు బ్యాంకుకు గండిపడే ప్రమాదం ఉందని పవన్ వీరాభిమానులు నాగబాబుకు హెచ్చరికలు తమ సందేశాల ద్వార పంపుతున్నట్లు టాక్. 
Kanche-Movie-Audio-Launch-15.jpg
ఇది ఇలా ఉండగా నాగబాబు ప్రస్తుతం బాలయ్యను టార్గెట్ చేస్తూ అనుసరిస్తున్న ఈవ్యూహం వెనుక గోదావరి జిల్లాలలో ఉన్న కాపు ఓటు బ్యాంకును రెచ్చగొట్టి సంఘటితం చేయడానికి నాగబాబు ఇలా బాలయ్యను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. తాను చేస్తున్న సెటైర్లకు తట్టుకోలేక బాలకృష్ణ తన పై అదేవిధంగా పవన్ కళ్యాణ్ పై మాటల దాడి మొదలు పెడితే ఆ వార్ ను మరింత పెంచి ఈ వ్యవహారం అంతా గోదావరి జిల్లాలలోని కాపు యువత పవన్ కు అనుకూలంగా సంఘటితం అయ్యేలా చేస్తున్న ఆలోచనలలో భాగమే ప్రస్తుతం నాగబాబు బాలయ్య  పై చేస్తున్న కామెంట్స్ వెనుక ఆంతర్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: