విప్లవ సినిమాల కథానాయకుడు ఆర్. నారాయణమూర్తి సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడేడప్పుడు చాల స్పీడ్ గా గందరగోళంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అటువంటి నారాయణ మూర్తి తీరు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఖంగారు పడేలా చేసింది. ఆసక్తి కలిగించే ఈ సంఘటన నిన్న హైదరాబాద్ లో జరిగిన ‘మణికర్ణిక’ మూవీ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో జరిగింది. ఈ ఫంక్షన్ కు వచ్చిన నారాయణ మూర్తి కంగనా రనౌత్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ఆమె వంక చూసి ‘పిల్ల భలే చేసింది’ అంటూ కామెంట్స్ చేసాడు. 
తెలుగువాడిగా గర్వపడుతున్నా
దీనితో ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులు అంతా తెగ నవ్వడంతో ఆమాటలకు అర్ధం తెలియక కొన్ని క్షణాలపాటు కంగనా షాక్ అయింది. అంతేకాదు మితిమీరిన ఉత్సాహంతో నారాయణ మూర్తి ఆమెను తెగ పొగుడ్తూ ఆవేశంతో ఉపన్యాసం చేస్తుంటే నారాయణమూర్తి ఎవరో తెలియక అతడి మాటలు అర్ధంకాక కంగనా వేదిక పై గందరగోళంగా మారడం స్పష్టంగా కనిపించింది.
 బాలీవుడ్‌లో నటించాలని
ఇదే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ కంగనా పొట్టి పిల్ల అయినా సినీ పరిశ్రమలో ఎన్నో అన్యాయాలను నిలదీస్తున్న వీర వనిత అంటూ మీటూ యూటూ అంటూ అక్రమాలను నిలదీస్తున్న కంగన రౌనత్‌ను అభినందించాలి అంటూ ఆమె పై ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఇదే సందర్భంలో తమ్మారెడ్డి మరొక ట్విస్ట్ ఇస్తూ కంగనా అహంకారానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు.
విజయేంద్ర ప్రసాద్ జాతీయ రచయిత
ఈసినిమా షూటింగ్ జరిగే సందర్భంలో ఒకసారి తాను క్రిష్ తో కలిసి ఉన్నప్పుడు షూటింగ్ స్పాట్ కు ఆలస్యంగా వచ్చిన కంగనను చూసి బాలీవుడ్ హీరోయిన్స్ కు విపరీతమైన అహంకారం ఉంటుంది అన్న విషయాన్ని తాను కూడ నమ్మానని కామెంట్ చేసాడు తమ్మారెడ్డి భారద్వాజ. అయితే అంత ఆలస్యంగా వచ్చిన కంగన మెరుపు వేగంతో పేజీల కొద్ది ఉన్న డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ సమర్ధతతోనే ఆమెకు ఆహాకారం వచ్చి ఉంటుంది అని అభిప్రాయ పడ్డాడు. ఈ మితిమీరిన ఆత్మవిశ్వాసం వలెనే కాబోలు కంగనకు క్రిష్ తో అభిప్రాయ భేదాలు వచ్చినా లెక్కచేయకుండా తానే దర్శకురాలిగా మారి ‘మణికర్ణిక’ ను పూర్తి చేయడమే కాకుండా ఈసినిమాకు ఇప్పటికే ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ వచ్చేలా హీరోలతో సమానంగా కంగన ఈమూవీని ప్రమోట్ చేస్తోంది..    



మరింత సమాచారం తెలుసుకోండి: