సీనియర్‌ హీరోలంతా తమ ఏజ్‌ కి తగ్గ పాత్రలు చేసుకుంటూ యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తూ ఉంటే నాగార్జున మాత్రం ప్రస్తుతం ఏచిత్రం చేయకుండా ఖాళీగా ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  అయితే నాగార్జున  హిందీలో తమిళంలో నిర్మించబడుతున్న రెండు సినిమాలలో అతిథిపాత్రలను పోషిస్తున్నా ఈ సినిమాల వల్ల నాగార్జున ఇమేజ్ కి పెద్దగా కలిసి వచ్చేదిలేదు. 

గత ఏడాదిలో వచ్చిన ఆఫీసర్‌ ఘోర పరాజయం చెందడంతో పాటు నానితో కలిసి నటించిన ‘దేవదాస్’ కూడ ఫెయిల్ కావడంతో  నాగార్జున కాన్ఫిడెన్స్‌ దెబ్బతిన్నది అని అంటున్నారు.  కొంతకాలం క్రితం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ‘మనం’ లాంటి చిత్రాలతో నాగార్జున హిట్స్ కొట్టడంతో నాగార్జున మార్కెట్ పెరిగినా ఆ మార్కెట్ ను నాగార్జున నిలబెట్టుకోలేక పోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

దీనికితోడు నాగార్జున కొడుకులు నాగచైతన్య అఖిల్ ల సినిమా కెరియర్ చెప్పికో దగ్గ స్థాయిలో లేకపోవడం నాగార్జునను తీవ్రంగా కలిచి వేస్తున్నట్లు టాక్. దీనికితోడు బాలకృష్ణ చిరంజీవి వెంకటేష్ లు డిఫెరెంట్ మూవీలలో నటిస్తూ సీనియర్ హీరోలుగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న నేపధ్యంలో తాను ఎటువంటి సినిమాలో నటించాలి అన్న అయోమయం కూడ నాగార్జునను వెంటాడుతున్నట్లు టాక్. 

దీనితో ఏదో హడావిడిగా ఏదో ఒక సినిమాను ఒప్పుకుని ఆసినిమా ఫెయిల్ అయితే బాధపడే కన్నా బాగా లోతుగా ఆలోచించి ఒక మంచి కధను ఎంచుకోవాలి అన్న ఉద్దేశ్యంతో నాగ్ తనకు సరిపడే కథ కోసం తీవ్ర అన్వేషణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం పై కొందరు యంగ్ రైటర్స్ మరియు దర్శకులతో చర్చలు జరుపుతూ నాగర్జున చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: