క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలోని కామాంధుల కబంద హస్తాల బారిన అనేక మంది నటీమణులు పడిన సంగతి తెలిసిందే. మీటూ అంటూ ఒక్కొక్కరుగా తమ అనుభవాలు చెప్పడం మొదలుపెట్టి చాలా కాలమైంది. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.

సంబంధిత చిత్రం


సమ్మోహనం సినిమా ద్వారా అందర్నీ సమ్మోహన పరిచిన అదితీరావ్‌ హైదరి కూడా గతంలో ఇలా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిందట. అసలు సినిమా ఇండస్ట్రీలో ఇలా ఉంటుందని కూడా తాను అప్పట్లో ఊహించలేదట. ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ఓ ప్రాజెక్టు విషయంలో తనను కమిట్‌మెంట్‌ అడిగారట.

aditi rao hydari sammohanam కోసం చిత్ర ఫలితం


ఆ కమిట్‌మెంట్‌ డిమాండ్‌ విని ఆశ్చర్యపోయిన అదితీరావ్.. ఆ ప్రాజెక్టుకు బై చెప్పేసిందట. ఆ తర్వాత దాదాపు 8 నెలలపాటు ఖాళీగా ఉండాల్సి వచ్చిందట. ఖాళీ ఉన్నందుకు ఇబ్బంది లేకపోయనా అలా అడిగినందుకు అదితీరావ్ షాకైపోయిందట.

aditi rao hydari sammohanam కోసం చిత్ర ఫలితం


ఆ ఘటన తర్వాత పెద్దగా మళ్లీ అలాంటి ప్రపోజల్స్ రాలేదట అదితీకి.. తనకు పెద్దగా ఇండస్ట్రీలో ఇబ్బందులు కూడా ఎదురుకాలేదంటోందీ ముద్దుగుమ్మ. కేరీర్‌ ప్రారంభించిన మొదట్లో చాలా అమాయకంగా ఉండేదాన్నని ఇప్పుడు కాస్త హుషారయ్యానని చెబుతోందీ సమ్మోహన సుందరి.


మరింత సమాచారం తెలుసుకోండి: