పవన్ కళ్యాణ్ అలీల మధ్య ఉన్న సాన్నిహిత్యం సంవత్సరాలతరబడి కొనసాగుతోంది. అలాంటి అలీ ఏకంగా పవన్ కళ్యాణ్ ను కన్ఫ్యూజ్ చేసిన విషయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. మొన్న పవన్ కళ్యాణ్ ను కలిసిన అలీ తాను ‘జనసేన’ లో చేరి కార్యకర్తగా ఉండదలుచుకోలేదనీ ఎవరు మంత్రి పదవి ఇస్తే ఆపార్టీలో చేరతానని స్పష్టం చేసినట్లు సమాచారం.
 రూటు మార్చిన పవన్ కళ్యాణ్
ఈ సమావేశం తరువాత బయటకు వచ్చిన అలీ మీడియాతో స్పష్టంగా మాట్లాడకపోయినా తన మనసులో భావం మటుకు పవన్ కు నేరుగా చెప్పేసాడు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు గత 20 ఏళ్లుగా తెలుగుదేశంలో ఒక కార్యకర్తగా కొనసాగుతున్న అలీ పవన్ దగ్గరకు వచ్చే సరికి ఇలాంటి కండిషన్స్ ఎందుకు పెట్టాడు అంటూ ఏకంగా పవన్ అభిమానులే అధిరిపోతున్నట్లు టాక్. 
జనసేన ప్రభుత్వం ఖాయం
తెలుస్తున్న సమాచారం మేరకు అలీ చెప్పిన కండిషన్స్ అన్నీ విన్న పవన్ దగ్గర నుండి అలీకి ఎటువంటి హామీ పవన్ వద్ద నుండి లభించలేదు అని తెలుస్తోంది. దీనితో రేపు ముగియబోతున్న జగన్ పాద యాత్ర సమయంలో ఇచ్చాపురం వెళ్లి అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరే విషయం కూడ తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్. అయితే అలీ కండిషన్స్ కు జగన్ ఒప్పుకుంటాడా అనే సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 
జిల్లాల సమీక్ష
గుంటూరు నుండి కాని రాజమండ్రి నుండి కానీ ఎదోఒక ఊరు నుండి ఎన్నికల బరిలో దిగి ఈసారి ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసి తన సత్తా చాటాలని ఆలోచనలలో ఉన్నాడు అలీ. కోరిక బాగానే ఉన్నా ముందుగా మంత్రి పదవి కండిషన్స్ పెడుతున్న అలీని ఎవరు ఆహ్వానిస్తారు అన్న విషయమై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. దీనితో అలీ తన స్థాయిని మించి రాజకీయ పార్టీల నాయకులతో బేరసారాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: