మరో రెండు రోజులలో విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామ’ మూవీని ప్రమోట్ చేస్తూ రామ్ చరణ్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి కలక్షన్స్ రికార్డుల పై ఆసక్తికర కామెంట్స్ చేసాడు. వ్యక్తిగతంగా తాను తన సినిమాలకు సంబంధించి రికార్డుల గురించి పట్టించుకొననీ అందుకనే తన సినిమాల పోస్టర్ల పై కలక్షన్స్ రికార్డులను వేయవద్దని తన నిర్మాతలను కోరినా వారు పట్టించుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 
 రంగస్థలం మూవీ తర్వాత
‘రంగస్థలం’ కు మంచి కలక్షన్స్ వచ్చినందుకు తనకు ఆనందం కలిగినా తాను నటించిన ప్రతి సినిమా ‘రంగస్థలం’ రేంజ్ లో హిట్ అవుతుందని నమ్మకం లేదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాదు ప్రస్తుత తరం హీరోలు ఎవరూ తమ సినిమాలకు సంబంధించిన రికార్డుల గురించి ఆలోచించడం లేదు కేవలం తాను నటించే పాత్రల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాము అంటూ చరణ్ మరొక ట్విస్ట్. 
 ప్రతీది రంగస్థలం మాదిరిగా
అదేవిధంగా టాప్ హీరోల మధ్య పోటీ మంచిసినిమాలు చేసే విషయంలో ఉండాలి కానీ కలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఉండకూడదు అంటూ ప్రతి శుక్రువారం మారిపోయే కలక్షన్ రికార్డుల పై తనకు నమ్మకం లేదు అని షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు చరణ్. దీనితో సంక్రాంతి సినిమాల పోటీలో విడుదల అవుతున్న ‘వినయ విధేయ రామ’ కలక్షన్స్ విద్వంశం పై తనకు కూడ అనుమానాలు ఉన్నాయి అన్న సంకేతాలు ఇస్తున్నాడు అనుకోవాలి. 
నాన్నను అనుసరిస్తున్నాను
ఇక తన సినిమా గురించి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుండి లైట్ బాయ్స్ వరకు తన సినిమా షూటింగ్ చివరిరోజున తనకు చిన్నచిన్న బహుమతులు ఇచ్చే అలవాటు ఉందనే విషయాన్ని చెపుతూ అందులోని తన స్వార్ధాన్ని వివరించాడు చరణ్. బహుమతులు అందుకున్నప్పుడు ప్రతి వ్యక్తి ఆనంద పడతాడని ఆ ఆనందంలోని పోజిటివ్ ఎనర్జీ తనకు కలిసివస్తుంది అన్న స్వార్ధంతో తాను తన యూనిట్ సభ్యులు అందరికీ బహుమతులు ఇస్తున్నాను అంటూ తనపై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు చరణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: