ఒకళ్ళ ప్రతిభ వేరొకళ్ళు అతి సునాయాసంగా కొట్టేసే సాంప్రదాయం చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువని అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా ఈ మద్య దర్శకుడు త్రివిక్రం "అరవింద సమేత..." ఒక ప్రొఫెసర్ స్థాయి రాయలసీమ రచయిత నుండి సంగ్రహించిన సమాచారాన్ని తన సినిమాలో వాడేసిన ఘటన మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో అదే జరిగిందట.  


ఎన్టీఆర్ బయోపిక్ సినిమా నేడే విడుదలైంది. ఆ సినిమా కోసం నందమూరి కుటుంబ అభిమానులు ఏంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై మార్కెట్ లో ఎక్కడాలేని క్రేజ్ ఏర్పడింది  అభిమానుల హడావిడి మొదలైపోయింది. చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా గడుపుతోంది. ఈవైపు ఇలా ఉండగా, మరోవైపు ఈ సినిమా కారణంగా ఒక రచయితకి అన్యాయం జరిగిందనే వార్త  షాకింగ్ గా మారింది. 
L Srinath NTR Biopic కోసం చిత్ర ఫలితం
ఒక సినిమాకు దర్శకుడుగా పేరుతెచ్చుకున్న చక్కటి అనుభవం సంపాదించిన నైపుణ్యంతో  డా. ఎల్. శ్రీనాథ్ "ఎన్టీఆర్" బయోపిక్ కి రచయితగా పని చేశారు. గత చాలా కాలంగా ఈ సినిమాకథకి  సంబంధించిన పనులు మొదలెట్టారు.  'కుబుసం' అనే సినిమాను రూపొందించిన దర్శకుడు ఎల్. శ్రీనాథ్ ఈ సినిమా కథ, కథనంపై పని చేస్తూవచ్చాడు. నందమూరి బాలకృష్ణ మొదట ఆమోదించిన కథ మొత్తం శ్రీనాథ్ ఆధ్వర్యంలోనే తయారైంది. దర్శకుడు తేజ కూడా దానికి ఒప్పుకున్నాడు. 


కానీ తరవాత ఏవో తేడాలొచ్చి ఈ చిత్ర దర్శకత్వ బాధ్యతలనుండి తేజ తప్పుకోవడం, ఆ తరవాత జాగర్ల మూడి క్రిష్ కూడా బాలీవుడ్ సినిమా మణికర్ణికని మద్యలో వదిలేసి వచ్చి ఇందులో ప్రవేశించటం జరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన క్రిష్ సినిమాపై తన ముద్ర కనిపించడం కోసం, కథ విషయంలో మార్పులు చేయడం కుదరక,  కథనంలో కొన్ని మార్పులు చేశాడు. స్క్రీన్-ప్లే విషయంలో తన ముద్ర చూపించాలన్న తాపత్రయం కోసం తగిన ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కథా కథనం సిద్ధం చేసిన డా. ఎల్. శ్రీనాథ్ ని పూర్తిగా పక్కన పడేశారు. వారి ప్రత్యేక నైపుణ్యం సినిమాపై కంటే ఈ విషయంపైనే   ఎక్కువ శ్రద్ద పెట్టేశారట.

చివరకు ఇంత కృషి చేసిన శ్రీనాథ్ పేరు  "సినిమా టైటిల్స్"లో కూడా ప్రకటించలేదు.  అణచివేత నుండే ఉద్యమం మోదలౌతుంది, అన్నది తెలంగాణ నేపధ్యం గల శ్రీనాథ్ కి ఉద్యమం, పోరాటాలకు సంబంధించిన అనుభవం ఉండటంలో ముందుగా ఈ విషయం  దర్శకుల సంఘంలో  ఫిర్యాదు చేశాడు. తెలంగాణాకి చెందిన శ్రీనాథ్ కి అన్యాయం చేస్తున్నారని, తెలంగాణ ప్రతిభని తొక్కేస్తున్నారని తెలంగాణా దర్శకుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం ఉంది.
jagarlamudi krish with NTR Biopic writer కోసం చిత్ర ఫలితం
దీంతో చీమంత సమస్య చాటంత పెద్దదైంది.  తప్పక పోవటంతో క్రిష్ తొ పంచాయితీలు జరిపారు. టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వడానికి క్రిష్ కి ఈగో సమస్యలు అడ్దు రావడంతో చివరకు రచన సహకారం అంటూ టైటిల్స్ లో కొంత స్పేస్ ఇచ్చారు శ్రీనాథ్ పేరు వేయడానికి ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. డా. శ్రీనాథ్ కి ఇవ్వాల్సిన రెమ్యూనరేషన్ కూడా పూర్తిస్థాయిలో ఇవ్వలేదని సమాచారం. అయితే ఈ వివాదం మొత్తం బయటకి పొక్కకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రనగరి సమాచారం.  దీన్నిబట్టి క్రిష్ మణికర్ణిక విషయంలో కూడా ఇలాంటి వేషాలువేసి ఉంటాడనే అంటున్నారు. మొత్తం మీద ఇది ఆయనకు కళంకమే.   

మరింత సమాచారం తెలుసుకోండి: