పెళ్లి చూపులు.. విజయ్‌ దేవరకొండకు బ్రేక్ ఇచ్చిన సినిమా.. ఈ చిత్రంతోనే విజయ్‌ దేవరకొండ ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి హిట్స్ రావడంతో విజయ్‌ దేవరకొండ ఎక్కడికో వెళ్లిపోయాడు. స్టార్ హీరో అయిపోయాడు.

Related image


ఐతే.. తనకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడికే రిటర్న్‌ గిఫ్ట్‌ గా బ్రేక్ ఇవ్వాలని విజయ్ దేవరకొండ ఆలోచిస్తున్నాడట. పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ ను హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచన చేస్తున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయట.

Image result for vijay devarakonda pelli choopulu


విజయ్‌ దేవరకొండ హీరోగా కాస్త క్రేజ్ రాగానే బిజినెస్‌ పరంగానూ ఆలోచనలు ప్రారంభించాడు. రౌడీ స్టోర్స్ స్థాపించాడు. ఆ తర్వాత తానే నిర్మాణ భాగస్వామ్యం ద్వారా నోటా సినిమా రూపొందించాడు. అది అంతగా సక్సస్ కాకపోయినా సినీనిర్మాణం కొనసాగించాలని డిసైడయ్యాడు.

Related image


అందులో భాగంగానే తరుణ్ భాస్కర్ హీరోగా సినిమాకు శ్రీకారం చుట్టాడట. ఇండస్ట్రీలో హీరోలు దర్శకులు కావడం సాధారణమే కానీ.. దర్శకులు హీరోలు కావడం మాత్రం చాలా అరుదు. మరి ఈ యంగ్ డైరెక్టర్‌ హీరోగా ఏమేరకు సక్సస్‌ అవుతాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: