గత వారం రోజులుగా నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ నందమూరి అభిమానులకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తున్నాయి. వాస్తవానికి ఈ విషయం పై అత్యంత ఆవేసపరుడైన బాలకృష్ణ పట్టించుకోకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 
Naga Babu shocking comments on Balakrishna
ప్రస్తుతం ‘జనసేన’ రాజకీయాలతో చాల బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ దృష్టికి ఈవిషయాన్ని కొందరు పవన్ సన్నిహితులు తీసుకువెళ్ళినట్లు సమాచారం. అంతేకాదు ఈ వ్యవహారం పై ‘జనసేన’ నాయకులు ఎలా స్పందించాలి అన్న విషయమై పవన్ సలహాలను అడిగినప్పుడు పార్టీ వర్గాలకు పవన్ ఈవిషయమై ఎవరూ ఊహించని కామెంట్స్ చేసినట్లు సమాచారం.

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ఈవిషయాన్ని చాల లైట్ గా తీసుకుంటూ ఈవిషయమై ఎవరు ఎటువంటి కామెంట్స్ చేయవద్దు అని సలహాలు ఇచ్చినట్లు టాక్. అంతేకాదు తన అన్న నాగబాబు అదేవిధంగా బాలకృష్ణ అత్యంత ఆవేసపరులు అనీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఆ క్షణానికి ఏమి అనిపిస్తే అలా మాట్లాడతారని అందువల్ల ఆవిషయాలను పట్టించుకోవద్దు అంటూ పవన్ తన జనసేన నాయకులకు సూచనలు ఇచ్చినట్లు టాక్.
Article
ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా కొన్ని రోజుల క్రితం ఇలాంటి సూచన ఈవ్యవాహారం పై తెలుగుదేశ వర్గాలకు ఆపార్టీ అధినాయకత్వం నుండి సూచనలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహ సూచనలు పవన్ నుండి ‘జనసేన’ వర్గాలకు వచ్చినట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో భవిష్యత్ లో మళ్ళీ జనసేన తెలుగుదేశం కలిసి రచించే వ్యూహాలకు సంకేతం అనుకోవాల అంటూ కొందరు విశ్లేషకుల భావన..  


మరింత సమాచారం తెలుసుకోండి: