అగ్రవర్ణాలలోని  పేదలకు విద్య - ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం పై ఇప్పడు జాతీయ స్థాయిలో తీవ్రచర్చలు జరుగుతున్నాయి. నిన్న ఈబిల్లుకు రాజ్యసభ ఆమోదం కూడ లభిచడంతో ఈనిర్ణయాన్ని మోడీ సర్కార్ రాబోయే ఎన్నికలలో తన ప్రధాన ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. 
Nikhil Siddharth’s Mudra satellite rights sold out
ఈరిజర్వేషన్ల పై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు నిఖిల్. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు నిఖిల్. ‘ఇటీవల రానా యాంకర్ గా ఉన్న నెం.1 యారీ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు రానాతో ఇదే అంశం పై చర్చ జరిగింది. అగ్రవర్ణాలకు రిజర్వేషన్ ఉండాలని నేను రానా అనుకున్నాం. తాజాగా అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారని మీడియాలో చూశాను. రానా నేను అనుకున్నదే మోడీ అమలు చేయడం సంతోషకంగా ఉంది. కులం, మతం, జాతి గురించి పట్టించుకోకుండా మోదీ సార్ న్యాయం చేశారు. జాతి వివక్షకు నో చెప్పండి’ అంటూ హీరో నిఖిల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 
'Chinnavadu' Nikhil All Set To Marry
దీనితో నిఖిల్ చేసిన ట్విట్ పై కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న మోడీ ఆలోచనలను నిఖిల్ ప్రభావితం చేసాడా అంటూ కొందరు  కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడ నిఖిల్ అనేక సామాజిక రాజకీయ విషయాల పై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ అనేక సందర్భాలలో అనేక ట్విట్స్ చేసాడు. అయితే నిఖిల్ చేసిన ట్విట్ పై భిన్న భిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. 
 
Article
మోదీకి నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే అధికారం చేపట్టిన నాడే ఈబిల్లును ప్రవేశపెట్టేవారని ఈబిల్లు వల్ల అగ్రవర్ణాల పేదలకంటే మోదీకే ఎక్కువ లాభం అంటూ ఇది ఎన్నికల జిమిక్కులో భాగమే అంటూ నిఖిల్ ట్విట్ ను టార్గెట్ చేస్తున్నారు. సామాజికి విషయాలా పై నిఖిల్ కు పెరిగి పోతున్న సామాజికి స్పృహను చూస్తుంటే నిఖిల్ కూడ రాజకీయాలలోకి వచ్చేరోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: