నిన్న విడుదలైన ‘కథానాయకుడు’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఈమూవీ కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అన్నది ఈరోజు ఈమూవీకి వచ్చే కలక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ కొన్ని ప్రముఖ ఛానల్స్ చర్చలు కూడ నిర్వహిస్తున్నాయి అంటే ఈమూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అని ఇండస్ట్రీలోని ఒక సామాజిక వర్గం చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 
ఎన్టీఆర్: కథానాయకుడు స్టోరీ
అయితే నిన్న ఉదయం హైదరాబాద్ లోని ఒక ధియేటర్ లో వేసిన ‘కథానాయకుడు’ ప్రత్యేక షోకు నందమూరి కుటుంబ సభ్యులు అంతా హాజరుఅయ్యారు. ఈసినిమా విషయంలో కొంత వరకు లోలోపల కోపంగా ఉన్నా బాలకృష్ణ సోదరులు సోదరీమణులు బావలు కూడ ప్రత్యేకంగా వచ్చి బాలయ్యను అభినందించారు. 
ఎన్టీఆర్ కథానాయకుడులో మలుపులు
ఈ షోకు బాలకృష్ణ  స్వయంగా జూనియర్ ను ఫోన్ చేసి ఆహ్వానించినా ఈ షోకు తాను వస్తానని చెప్పి చివరి నిముషంలో రాకపోవడం నందమూరి కుటుంబ సభ్యులకు షాక్ ఇచ్చినట్లు టాక్. ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ కు జూనియర్ అతిధిగా రావడమే కాకుండా బాలయ్యను ఆకాశంలోకి ఎత్తేస్తూ పొగిడిన నేపధ్యంలో వీరిద్దరి మధ్య గ్యాప్ పూర్తిగా తగ్గిపోయింది అని అనుకున్నారు అంతా. 
తొలిభాగం
అయితే దీనికి భిన్నంగా నిన్న జరిగిన ‘కథానాయకుడు’ స్పెషల్ షోకు జూనియర్ రాకుండా ఒక ప్రముఖ వ్యక్తి అడ్డంపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఆవ్యక్తి ఎవరు అనే విషయం పై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ప్రస్తుతం రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తి అతడు అని అంటున్నారు. దీనితో తిరిగి మళ్ళీ జూనియర్ బాలయ్యల మధ్య గ్యాప్ మొదలైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. కనీసం ఈసినిమా విడుదల రోజున జూనియర్ తన బాబాయ్ ని అభినందిస్తూ ఒక ట్విట్ కూడ పెట్టకపోవడంతో ఈ గసిప్పులకు మరింత బలం చేకూరుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: