ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలై పాజిటివ్ టాక్‌ తో సంక్రాంతికి సందడి చేస్తోంది. ఈ సినిమా గెటప్స్ పై మిశ్రమ స్పందన వస్తోంది. యంగ్ ఎన్టీఆర్‌ గా బాలయ్య లుక్ అస్సలు బాగా లేదని.. సీనియర్ ఎన్టీఆర్ గా మాత్రం కుమ్మేశారని టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్, ఏఎన్నార్‌ గా సుమంత్ బాగా చేశారని అంటున్నారు.

Image result for krish rana


ఈ సినిమాలో మరో కీలక పాత్ర చంద్రబాబు. దీన్ని పోషించిన రానా నటనపై పెద్దగా చర్చ జరగడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్‌లో చంద్రబాబు పాత్రకు పెద్దగా స్కోప్‌ లేకపోవడంతో రానా నటన గురించి అప్పుడే ఏమీ చెప్పలేనిపరిస్థితి. సెకండ్ పార్ట్‌ మహానాయకుడులో మాత్రం రానా రోల్ ఇంపార్టెంట్ కానుంది.



మరి క్రిష్ చంద్రబాబుగా రానా రాణిస్తారా అన్న చర్చ జరుగుతున్న సమయంలోనే రామ్ గోపాల్ వర్మ తన చంద్రబాబు ఫస్ట్ లుక్‌ను బయటపెట్టేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో చంద్రబాబుగా నటిస్తున్న శ్రీతేజ్ లుక్ చాలాబాగా వచ్చిందని టాక్ వినిపిస్తోంది.

Related image


వర్మ విడుదల చేసిన నాలుగైదు పోజులు బావున్నాయి. ఇప్పుడు రానా, శ్రీతేజ్ ఈ ఇద్దరు చంద్రబాబు పాత్రకు ఎవరు బాగా సూట్ అయ్యారన్న చర్చ నెటిజన్లలో మొదలైంది.



క్రిష్ ఎన్టీఆర్‌లో చంద్రబాబును నెగిటివ్ రోల్‌ లో చూపించే అవకాశం ఏమాత్రం లేదు. కానీ ఆర్జీవీ ఎన్టీఆర్‌లో మాత్రం చంద్రబాబే మెయిన్ విలన్ గా ఉండొచ్చు. సో.. శ్రీతేజ్‌ కళ్లలో ఆ విలనిజం బాగా ఫోకస్‌ అవుతుంది. రానా సంగతి ఏమో కానీ శ్రీతేజ్‌కు మాత్రం యాక్టింగ్‌కు మంచి స్కోప్‌ ఉంది. మరి ఈ ఇద్దరిలో చంద్రబాబుగా ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: