పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లెక్చరర్ అవతారం ఎత్తి గత కొన్నిరోజులుగా ‘జనసేన’ కు సంబంధించిన జిల్లా మీటింగ్ లలో చేస్తున్న ఉపన్యాసాలు పవన్ అభిమానులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది అని వార్తలు వస్తున్నాయి. పవన్ తన లేటెస్ట్ ఉపన్యాసాలలో తన అభిమానులను ఉద్దేసించి ‘త్యాగాలు చేయండి పార్టీ కోసం పనిచేయండి పాతికేళ్లు కష్టపడండి’ అంటూ వరసపెట్టి ఇస్తున్న లెక్చర్స్ వింటూ పవన్ అంతర్గత సమావేశాలకు వచ్చిన జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు కనీసం కుర్చీల్లోంచి కదిలే సదుపాయం కూడా లేకుండా ఊపిరి బిగపట్టి పవన్ ఉపన్యాసాలు వినడం తప్ప మరో మార్గం లేకపోవడంతో తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్.

సాధారణంగా పార్టీ మీటింగ్ లలో నాయకులు కార్యకర్తల సమస్యలు తెలుసుకుంటారు. స్థానికి రాజకీయాల పై స్థానికంగా ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నాయకుల గురించి ఎవరు చెపితే ఎక్కువ ఓట్లు పడతాయి అన్న విషయాలను ఆరా తీస్తారు. అయితే దీనికి భిన్నంగా పవన్ ఉపన్యాసాలు సాగుతూ ఒక వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతికి వచ్చిన విద్యార్దులులా పవన్ అభిమానులు భావించవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
  
దీనితో పవన్ ఉపన్యాసాల ధాటి తట్టుకోలేక పవన్ చెపుతున్న కొన్ని మాటలు అర్ధంకాక పవన్ వీరాభిమానులు కూడ తలపట్టుకుంటున్నట్లు టాక్. పవన్ లో ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఉన్నాడు అన్న విషయాన్ని తెలియచేసే విధంగా పవన్ ఉపన్యాసాలు ఉంటున్నాయి కాని రాబోతున్న ఎన్నికలలో జనసైనికులు ఎలా వ్యవహరించాలి అనే విషయమై ఎటువంటి దిశానిర్దేశం చేయలేని స్థాయిలో సాధారణ స్థాయిలో ఉండే పవన్ అభిమానులకు అర్ధంకాని రీతిలో పవన్ ఉన్యాసాలు కొనసాగుతున్నట్లు టాక్.

దీనితో చాలామంది జనసేన కార్యకర్తలు వివిధ జిల్లాలలో పవన్ నిర్వహించే అంతరంగిక సమావేశాలకు వెళ్ళడానికి భయపడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో అసలే జనసేనకు కార్యకర్తలు తక్కువగా ఉన్న పరిస్థుతులలో ఇలా భయపెడితే జనసేనకు కార్యకర్తలు ఎక్కడ నుంచి వస్తారు అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నట్లు టాక్..   



మరింత సమాచారం తెలుసుకోండి: