మంగ్లీ, బిత్తిరి సత్తి.. వీ6 ఛానల్ ద్వారా పాపులర్ అయిన మంగ్లీ, బిత్తిరి సత్తి ఇప్పుడు సెలబ్రెటీల జాబితాలో చేరిపోయారు. పండుగలు, పబ్బాల సమయంలో ప్రత్యేక గీతాలు రూపొందిస్తూ సందడి చేస్తున్నారు. ఈ సంక్రాంతి వేళ కూడా మంగ్లీ, బిత్తిరి సత్తి రూపొందించిన పాటలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.



ప్రత్యేకించి మంగ్లీ, హన్మంత్ యాదవ్ పాడిన రంగుల పుట్టిళ్లూ.. తెలుగు లోగిళ్లూ..ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ.. పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ పాట నాలుగు రోజుల్లోనే 35 లక్షల వ్యూస్ సంపాదించి సంచలనం సృష్టిస్తోంది. మైక్ టీవీ ఈ పాటను రూపొందించింది.



కురిసె మంచు జల్లు.. తెరిసే పూల కళ్లూ.. గొబ్బెమ్మల తలపై పూలు వర్థిళ్లూ అంటూ పాట సాగుతోంది. ఈ పాటను మిట్టపల్లి సురేందర్ రాయగా బాజీ సంగీతం అందించారు. గత ఏడాది కూడా మంగ్లీ పాట సంచలనం సృష్టించింది. ఆ పాట రెండున్నర కోట్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.



ఇక బిత్తిరి సత్తి రూపొందించిన భోగభాగ్యముల.. పాటను డాక్టర్ కందికొండ రాయగా రాఘవ సంగీతం అందించారు. భోగిమంటల బొమ్మల కొలువు.. రంగ వల్లుల రంగుల నెలవు.. సంక్రాంతితో శ్రమలకు సెలవు.. మంచు మేఘములు కురిసెను జల్లు.. కన్నబిడ్డలు చేరెను ఇల్లు.. తల్లిదండ్రుల గుండెలో తిరునాళ్లూ.. అంటూ బిత్తిరి సత్తి స్వయంగా ఆలపించాడు. ఈ పాట ఇప్పటి వరకూ పదిలక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: