ఆ మద్య ఓ యూట్యూబ్ వీడియోలో  కన్ను కొట్టి కుర్రకారును తనవైపునకు తిప్పుకొన్న మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. కేవలం ఒకే ఒక్క పాటతో ప్రపంచ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించి ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.  ఆమె నటించిన తొలి బాలీవుడ్‌ చిత్రం ‘శ్రీదేవి బంగ్లా’.  ప్రస్తుతం ఈ భామ ‘శ్రీదేవి బంగ్లా’ పేరుతో ఓ సినిమా చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు. 


ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఈ చిత్రం షూటింగ్ పూర్తైయింది. ఈ చిత్రం ప్రశాంత్‌ మాంబుల్లి  డైరెక్ట్ చేసాడు.  ఓ చిన్నారి శ్రీదేవి (ప్రియాప్రకాశ్ పాత్ర) దగ్గరకు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మీకు ఇష్టమైన నటి ఎవరు అని అడగ్గా..నాకు ఇష్టమైన నటిని నేనే అని శ్రీదేవి చెబుతుంది.  మందు తాగటం, సిగరెట్ తాగటం లాంటి సన్నివేశాలు చూపించి.. చివర్లో బాత్ టబ్‌లో ఓ శవం కాళ్లు చూపించి సినిమా పై అంచనాలు పెంచేశారు.


ఈ ట్రైలర్ చూడగానే.. శ్రీదేవి జీవితంలోని కీలక సంఘటనలు ఈ చిత్రంలో చూపించనున్నారా?  అన్న అనుమానాలు వస్తున్నాయి.  ఒక నిమిషం 49 సెకనుల నిడివితో విడుదలైన ఈ టీజర్.. ఎంతో ఆసక్తికరంగా మలిచారు.  గత కొంత కాలంగా ప్రియా వారియర్ తెలుగు, హిందీ భాషల్లో నటించాలన్న ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి ‘శ్రీదేవి బంగ్లా’ఈ అమ్మడికి ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: