నందమూరి సింహం బాలకృష్ణకు జాతకాలు ముహూర్తాలు అంటే విపరీతమైన నమ్మకం. ఇలాంటి నమ్మకాలు ఉన్న బాలకృష్ణ తన జాతక సెంటిమెంట్ కు సంబంధించి ఒక ప్రధాన విషయాన్ని పట్టించుకోకుండా వేసిన తప్పటడుగు వల్ల ‘కథానాయకుడు’ పరాజయం చెందింది అంటూ ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
 1000 స్క్రీన్లలో ప్రపంచవ్యాప్తంగా
ఆపత్రిక కథనం ప్రకారం బాలయ్యకు నిర్మాతగా చేసిన ప్రయోగాలు ఎప్పుడు కలిసిరాలేదు. గతంలో బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరించిన ఒక మూవీ షూటింగ్ సమయంలో కాలుకు గాయం అవ్వడంతో మూడు నెలలు ఇంటికి పరిమితం అయ్యాడు. అదేవిధంగా బాలకృష్ణ 2003లో దర్శకుడుగా మారుదామని ప్రయత్నించి మొదలుపెట్టిన ‘నర్తనశాల’ మూవీ సౌందర్య విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆసినిమా ఆగిపోయింది. 
 తొలివారాంతంలో
ఈమూవీలో బాలకృష్ణ అర్జునుడు బృహన్నల కీచకుడుగా త్రిపాత్రాభినయం చేయాలని చాల కష్టపడ్డాడు. మధ్యలో ఆగిపోయిన ఈమూవీ వల్ల బాలకృష్ణ చాల నష్టపోయాడు అన్న వార్తలు కూడ అప్పట్లో వచ్చాయి. ఆతరువాత సినిమా నిర్మాణానికి దూరం అయిన బాలకృష్ణ చాల గ్యాప్ తరువాత తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాణం కోసం తిరిగి నిర్మాతగా మారి ఎన్ బి కె ఫిలింమ్స్ ప్రొడక్షన్ హోస్ ను మొదలుపెట్టి భారీ స్థాయిలో ఎన్టీఆర్ బయోపిక్ ను నిర్మించాడు. 
నికర వసూళ్లు 16 కోట్లే
ఈసినిమాకు విడుదల ముందు ఏర్పడ్డ క్రేజ్ తో ఈమూవీకి సుమారు 100 కోట్ల బిజినెస్ జరగడంతో ఈమూవీ పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఈమూవీకి టాక్ బాగా వచ్చినా కలక్షన్స్ విషయంలో పూర్తిగా చతికల పడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇది అంతా బాలకృష్ణ జాతక ప్రభావం వల్లనే జరిగిందని బాలయ్య నమ్ముతున్నాడని టాక్. దీనితో ఫిబ్రవరిలో విడుదల కాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం ‘మహానాయకుడు’ కు సంబంధించి నిర్మాతల పేర్లలో తన పేరుకు బదులుగా ఈమూవీకి సహనిర్మాతలుగా వ్యవహరించిన సాయి కొర్రపాటి విష్ణు ఇందూరిల పేర్లు మాత్రమే టైటిల్ కార్డ్స్ లో వేసి ఎక్కడా తన పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట బాలయ్య.. 



మరింత సమాచారం తెలుసుకోండి: