తెలుగు ఇండస్ట్రీలో తనదైన కామెడీ మార్క్ చాటుకుంటూ కోట్ల మంది అభిమానుల మనసు దోచారు బ్రహ్మానందం.  కేవలం ఆయన హావభావాలతోనే థియేటర్లో కూర్చున్నవారిని కడుపుబ్బా నవ్వించగల సత్తా ఆయనకు ఉంది.  ప్రముఖ హాస్య దర్శకులు జంద్యాల దర్శకత్వంలో ‘అహనా పెళ్లంట’చిత్రంలో అరగుండు బ్రహ్మానందంగా ఎంట్రీ ఇచ్చిన ఆయన అతి తక్కువ కాలంలోనే బెస్ట్ కమెడియన్ గా ఎదిగారు. 
Related image
హీరోగా కూడా పలు చిత్రాల్లో నటించారు.  దాదాపు వెయ్యి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సినీ కమెడియన్‌ కన్నెగంటి బ్రహ్మానందం (62) కు గత ఆదివారం గుండెపోటు వచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వెంటనే ఆయన్ను ఆసియన్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ కు తరలించారు.
Image result for brahmanandam
పలు పరీక్షలు చేసిన ప్రముఖ హార్ట్‌ సర్జన్‌ రమాకాంత పాండా, బ్రహ్మానందానికి బైపాస్‌ చేయాలని నిర్ణయించడంతో..వెంటనే ఆయనకు బైపాస్‌ సర్జరీ చేశారు.ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని.. అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన కొడుకులు రాజా గౌతమ్, సిద్దార్థ్ ఆసుపత్రిలో దగ్గరుండి చూసుకున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: