తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఓటమి ఎరుగని ధీరుడు అంటారు. ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాలు ఏది ఫ్లాప్ కాలేదు.  ఇక రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది.  ఇప్పటికే పలు టాప్ హీరోలతో రాజమౌళి చిత్రాలు తెరకెక్కించారు.  బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఒక మల్టీస్టారర్ చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే.  ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్నారు.  ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది..ఇక ఫస్ట్ లుక్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.  సాధారణంగా రాజమౌళి చిత్రాలంటే చాలా టైమ్ తీసుకుంటుందన్న విషయం తెలిసిందే. 

బాహుబలి చిత్రం కోసం ఏకంగా ఐదు సంవత్సరాల టైమ్ తీసుకున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసం ఎంత సమయం తీసుకుంటారో అని అభిమానులు అనుకుంటున్న సమయంలో అందరికీ షాక్ ఇస్తూ..ఒకే ఏడాదిలో ట్రిపుల్ ఆర్ పూర్తి చేస్తానంటున్నాడు ఈ దర్శకధీరుడు. రాజమౌళి చిత్రం అంటే ఎలా ఉంటుందో క్లారిటి ఉంటుంది.. కానీ ఇక్క‌డ మ‌రో క్లారిటీ కూడా ఉండాలి. ఇక రాజమౌళి చిత్రం అంటే హీరోలు అన్నీ వ‌దిలేసుకుని రావాలి. పూర్తిగా రాజ‌మౌళి కంట్రోల్లోకి వ‌చ్చేయాలి.  బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ ఏకంగా తన ఐదు సంవత్సరాలు తన సమయాన్ని వెచ్చించారు.

ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్‌ల‌కు కూడా ఇవే తంటాలు వస్తాయేమో అని అభిమానులు ముందు నుంచి కంగారుపడుతున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం నెలాఖరులో రెండో షెడ్యూల్ మొదలు కానుంది. జనవరి 21 నుంచి ఆర్ఆర్ఆర్ రెండో షెడ్యూల్ మొదలుకానుంది. ఇందులో చరణ్, ఎన్టీఆర్ పాల్గొంటారు.  గతంలో బాహుబలి చిత్రం సమయంలో కొన్ని బ్రేకులు వచ్చాయి..కానీ ఇప్పుడు ఆలాంటి పొరపాటు రానివ్వకుండా  అక్టోబర్ వరకు ఈ ఇద్దరు హీరోల బల్క్ డేట్స్ రాజ‌మౌళి అడిగినట్లు సమాచారం.
Related image
అక్టోబర్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు తీసుకోనున్నాడు రాజమౌళి. అంతే కాదు అక్టోబర్ లోపు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఆరు నెలలు తీసుకోనున్నారు రాజమౌళి.  మరి ఇది ఈ ఇద్దరు స్టార్ హీరోలకు షాకింగ్ విషయమే అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి తో చిత్రం అంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలైన టైమ్ పోతుందని ఫిక్సయి ఉంటారు..కానీ ఈ దర్శకుడు మాత్రం ఏడాదిలోనే మూవీ ఫినిష్ చేయబోతున్నాడని తెలిస్తే ఒకింత షాక్ అన్నట్లే లెక్క. అన్నీ కుదిర్తే 2020 స‌మ్మ‌ర్లో ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నాడు రాజ‌మౌళి. 


మరింత సమాచారం తెలుసుకోండి: