సోషల్ మీడియా వచ్చాక ఓపెన్ ఛాలెంజ్‌లు పెరిగిపోయాయి. గతంలో ఐస్‌ బకెట్ ఛాలెంజ్.. కికి ఛాలెంజ్.. ఇలా ఏవో ఒక ఛాలెంజులు వస్తూనే ఉంటాయి. క్రమంగా అవి ఒకరి నుంచి మరొకరికి పాకుతూ సెన్సేషన్ అవుతుంటాయి.



అలా ఇప్పుడు సినీ స్టార్స్‌ను కుదిపేస్తున్నదే 10 ఇయర్స్ ఛాలెంజ్.. ఏంటీ 10 ఇయర్స్ ఛాలెంజ్ అంటారా.. ఏమీ లేదు. పదేళ్ల క్రితం తాము ఎలా ఉన్నారో చూపించేదే ఈ చాలెంజ్.. పదేళ్లనాటి పాత ఫోటో.. ఇప్పటి ఫోటో జత చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నమాట.



ఇప్పటివరకూ ఈ ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేసిన తారలు చాలా మందే ఉన్నారు. శ్రుతిహాసన్, ఛార్మి, లావణ్య త్రిపాఠీ, సందీప్ కిషన్ వంటి టాలీవుడ్ నటులతో పాటు సోనమ్‌ కపూర్, బిపాసా బసు వంటి బాలీవుడ్ నటులూ ఇందులో హుషారుగా పాల్గొన్నారు. తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.



పదేళ్ల కాలమంటే తక్కువేమీ కాదు.. ఇప్పుడు స్టార్లుగా వెలుగొందుతున్న చాలా మంది అప్పుడు సామాన్యులే. మరి సామాన్యులు.. సెలబ్రెటీలుగా మారితే చాలా మార్పు వస్తుందిగా.. ఆ ఛేంజ్‌ను చూపించేదే ఈ 10 ఇయర్స్ ఛాలెంజ్ అన్నమాట. ఆ సెలబ్రెటీల ఫోటోలు చూసి మీరూ ఎంజాయ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: