రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ సెకండ్ షెడ్యూల్ ను ఈనెల 21వ తారీఖు నుండి మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు. కార్తికేయ పెళ్లి హడావిడి పూర్తి కావడంతో రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ వ్యవహారాల పై తిరిగి దృష్టి పెడుతూ తన మూవీ హీరోలు అయిన జూనియర్ చరణ్ లను తమ హాలిడే మూడ్ నుండి బయటకు వచ్చి ఈనెల 21వ తారీఖు నుండి తనకు అందుబాటులో ఉండవలసిందిగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ కథకు సంబంధించి అనేక లీకులు వచ్చిన విషయం తెలిసిందే. ఈమూవీ కథ పునర్జన్మల చుట్టూ తిరుగుతూ ఈమూవీలోని కొంత భాగం 1940 ప్రాంతానికి సంబంధించి మరికొంత భాగం 2019 ప్రాంతానికి సంబంధించి ఉంటుంది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఈకథలో మరొక ట్విస్ట్ కూడ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈసినిమాకు సంబంధించిన 1940 ప్రాంతానికి చెందిన కథలో చరణ్ అలనాటి జమిందారి కుటుంబలో పుట్టిన ధనవంతుడుగా కనిపిస్తే జూనియర్ పేద వాడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. అయితే 2018 ప్రాంతానికి సంబంధించి ఈమూవీ కధలో జూనియర్ ఒక పారిశ్రామిక వేత్త కుమారుడుగా కనిపిస్తే చరణ్ ఒక స్లమ్ ఏరియాలో నివసించే పేదవాడుగా కనిపిస్తాడని సమాచారం. 

స్వాతంత్రోద్యమ నేపధ్యంలో ఈసినిమా 1940 ప్రాంతపు కథ కొనసాగి ఇప్పటి కాలానికి మారిపోతుంది. కానీ ఈ రెండు కాలాలలోనూ కొనసాగుతున్న ఆర్ధిక వ్యత్యాసాలు ధనవంతులు పేదవారిని వారి అవసరాల కోసం ఎలా పావులుగా ఆనాడు ఈనాడు ఎలా వాడుకుంటున్నారు అనే మనీ వార్ చుట్టూ ఈమూవీ కథ స్థూలంగా అల్లబడినట్లు తెలుస్తోంది. 

దీనితో 1940 ప్రాంతం కథలో చరణ్ అలనాటి జమిందారి వారసుడుగా గ్లామర్ గా కనిపిస్తే ఈనాటి కాలం కథలో చరణ్ డీ గ్లామర్ గా కనిపించబోతున్నాడు. అదేవిధంగా జూనియర్ 1940 ప్రాంతపు కథలో పేదవాడిగా డీ గ్లామర్ గా కనిపిస్తే ఈసినిమాకు సంబంధించిన ప్రస్తుత కథలో గ్లామర్ గా విలాసవంతమైన జీవితంలో కనిపించబోతున్నాడు. ఇలా రాజమౌళి తెలివిగా చరణ్ జూనియర్ ల అభిమానులకు ఎవరికీ కోపం తెప్పించకుండా వీరి పాత్రలకు సంబంధించిన ఆర్ధిక వ్యత్యాసాలు చాల తెలివిగా చూపెడుతున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: