తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.  ఈ రియాల్టీ షోలో 17 మంది ఇంటి సభ్యులు పాల్గొన్నారు.  అయితే ఇందులో కామన్ మాన్ గా సంచన, గణేష్, నూతన్ నాయుడు లు ఎంట్రీ ఇచ్చారు.  మొదటి వారం సంజన ఎలిమినేట్ అయ్యింది.  అప్పటి నుంచి బిగ్ బాస్ 2 లో సంచలనాలు మొదలయ్యాయి.  ఆ తర్వాత ఇంటి సభ్యుల మద్య గొడవలు, గ్యాంగ్ మెయింటేన్స్, రొమాంటి సన్నివేశాలు ఎన్నో జరుగుతూ వచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 1 లో ఇలాంటి చెత్త లేదంటూ ఎంతో మంది బిగ్ బాస్ సీజన్ 2 పై విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు.  అయితే మొదటి నుంచి బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ పై ఇంటి సభ్యులు వ్యతిరేఖత ప్రదర్శిస్తూ వచ్చారు.

మరోవైపు కౌశల్ కి బయట కౌశల్ ఆర్మీ ఏర్పటం..వారు శాసించినట్లే ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవ్వడం జరుగుతూ వస్తుందని వార్తలు వచ్చాయి.  ఇలా బిగ్ బాస్ సీజన్ 2 ప్రతిరోజూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చింది.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ గెలుపొందారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 ఇంటి సభ్యులుగా ఉన్న బాబు గోగినేని వర్సెస్ కౌశల్ మద్య వివాదం రోజు రోజుకీ ముదిరిపోతుంది. తాజాగా బాబు గోగినేని ఆస్ట్రేలియాలో నాని, కౌశల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Image result for bigg boss kaushal winner
‘బిగ్‌బాస్’ హౌస్‌లో కౌశల్‌కి వ్యతిరేకత ఏర్పడటం.. అది కాస్తా బయట అనుకూలంగా మారటం.. కౌశల్ ఆర్మీ ఏర్పడటం జరిగిపోయాయి. కౌశల్‌కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వారిని ఇంటర్నెట్‌లో బాగా ట్రోల్ చేశారు. కౌశల్‌ను విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని బాబు గోగినేని తెలిపారు. కౌశల్ సేన ఒత్తిడికి తలొగ్గి షో నిర్వాహకులు అతడినే విజేతని చేశారని... ఇది నానికి అస్సలు ఇష్టం లేదని.. అందుకే విజేతను ప్రకటించే సమయంలో ఆయన ఎంతో ఆలోచించారని బాబు తెలిపారు.  ఇప్పుడు కౌశల్ ఆర్మీ బాబు గోగినేనికి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: