సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసిపోయాక వెనువెంటనే సినిమాలు విడుదల చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల మ్యానియా ఆనెల అంతా కొనసాగుతూనే ఉంటుంది. అయితే అనూహ్యంగా ఈసంక్రాంతి రేస్ కు వచ్చిన 4 సినిమాలలో ఒక్క ‘ఎఫ్ 2’ తప్ప మిగితా సినిమాలు అన్ని ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఇప్పుడు ఆవిషయం అఖిల్ కు అడ్వాంటేజ్ గా మారుతుందా అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

ప్రస్తుతం మరో పెద్ద సినిమా లేకపోవడం బాలయ్య చరణ్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అఖిల్ సినిమాకు అత్యథిక స్థాయిలో థియేటర్లు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడ్డాయి. దీనితో అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా  ఆ సినిమా హిట్ అయ్యే అవకాశాలు  పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

అయితే ఈమూవీ నిర్మాతలు  ‘మిస్టర్ మజ్నూ’ ను కాస్త జాగ్రత్తగా ప్లాన్డ్ గా విడుదల చేస్తున్నారు. థియేటర్లు చాలావరకు ఈవారం ఖాళీ అయిపోయినా ఇష్టం వచ్చినట్లు థియేటర్లు తీసుకోకుండా ఊరిని బట్టి సెంటర్లను బట్టి సెలక్టివ్ గా థియేటర్లు తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఈసినిమాకు వందల సంఖ్యలో ధియేటర్లు తీసుకుని భారీ ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చాయి అని చెప్పుకోవడం కంటే ఈమూవీని కొంతకాలం ఈధియేటర్లలో రన్ ఉండేలా చూడటానికి ఈమూవీని మన ఇరు రాష్ట్రాలలోను  కేవలం 400 ధియేటర్లలో మాత్రమే విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి మరో రెండు వందల దియేటర్లు అందుబాటులోకి వచ్చినా ‘మిస్టర్ మజ్ను’ నిర్మాతలు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ప్లాన్డ్ గా వెళ్ళడం వెనుక నాగార్జున సలహాలు ఉన్నాయి అని టాక్. దీనితో ఈకొత్త ప్లాన్ అఖిల్ కు ఎంతవరకు కలిసి వస్తుంది అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: