‘బాహుబలి’ రికార్డుల పరంపర ఆసినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆమూవీ మ్యానియా కొనసాగుతూనే ఉంది. ఇండియన్ కలక్షన్స్ రికార్డులను క్రియేట్ చేసిన ఈమూవీకి కలక్షన్స్ తో పాటు అవార్డులు కూడ ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి మరొక అరుదైన గుర్తింపు లభించింది. 2009 నుంచి 2018 వరకు దేశంలోని అత్యుత్తమ చిత్రాల జాబితాను ఓర్మాక్స్ మీడియా రూపొందించింది. 

ఈ సంస్థ ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి ఆ దశాబ్దాన్ని ప్రభావితం చేసిన గొప్ప సినిమాల లిస్టును ప్రకటిస్తూ ఉంటుంది. ఈ సంస్థ ప్రకటించిన జాబితాలో 90 పాయింట్లతో 3 ఇడియెట్స్ చిత్రం టాప్ పొజిషన్‌ లో నిలిచింది. రెండోస్థానంలో ‘బాహుబలి2’ 85 పాయింట్లతో మూడో స్థానంలో ‘బాహుబలి1’ 83 పాయింట్లతో టాప్‌ ‌గా నిలువడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

ఇక ఇదే లిస్టులో ‘దంగల్’ 82 పాయింట్లతో ‘భాగ్ మిల్కా భాగ్’ 82 పాయింట్లతో ‘సంజూ’ 80 పాయింట్లతో ‘కేజీఎఫ్’ 79 పాయింట్లతో ‘క్వీన్’ 78 పాయింట్లతో ‘భజరంగీ భాయ్‌జాన్’ 77 పాయింట్లతో ‘బర్ఫీ’ 77 పాయింట్లతో టాప్ పొజిషన్‌ లో నిలిచాయి. సాధారణంగా దక్షిణాదికి సంబంధించిన సినిమాలకు ఓర్మాక్స్ మీడియాలో స్థానం లభించదు. అలాంటిది ఈసంస్థ ప్రకటించిన  తొలి మూడు స్థానాల్లో ‘బాహుబలి’ కి రెండు స్థానాలు లభించడం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గౌరవంగా మారింది. 
See the source image
ప్రస్తుతం ఈసంస్థ ప్రకటించిన లిస్టు బయటకు రావడంతో ‘బాహుబలి’ నిర్మాతలు అదేవిధంగా రాజమౌళి ఈ రేటింగ్స్ ఇచ్చిన ఆసంస్థకు కృతజ్ఞతలు తెలియచేసారు. రెండు సంవత్సరాలు గడిచిపోయినా ‘బాహుబలి’ మ్యానియా ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో రాజమౌళికి తన ‘బాహుబలి’ కి వస్తున్న గుర్తింపులు ఒక విధంగా టెన్షన్ ను క్రియేట్ చేస్తాయి. రాజమౌళి తీయబోయే ప్రతి సినిమా విషయంలో ప్రేక్షకులు ఎదో ఒక అద్భుతాన్ని ఆశిస్తారు. ఈకారణాలు వల్లనే రాజమౌళి తన ‘ఆర్ ఆర్ ఆర్’ కథ విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తూ ఈమూవీ ప్రాజెక్ట్ అంచనాలు అందుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: