‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ తో రామ్ చరణ్ కెరీర్‌ ని బోయపాటి దెబ్బతీశాడా ? లేక బోయపాటి స్టామినాని చెర్రీ కిల్ చేశాడా ? అనే ఆసక్తికర చర్చలు జరుగున్న పరిస్థితుల మధ్య ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ ఫెయిల్యూర్ పవన్ చరణ్ అభిమానుల మధ్య రికార్డుల రగడను సృష్టించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా  మారింది. సంక్రాంతి సినిమాల రేస్ కు అత్యంత భారీఅంచనాల మధ్య విడుదలయిన   ‘వినయ విధేయ రామ’ ప్రేక్షకుడ్ని ఎంతమేరకు ఆకట్టుకుంది అన్నవిషయం పక్కన సోషల్ మీడియా ట్రోలర్లకు మాత్రం మంచి అవకాశాన్ని ఇచ్చింది.    
Mega heroes movies releases for Sankranthi with 1 week gap
సినిమా కంటెంట్ మీద చెర్రీ పెర్ఫార్మెన్స్ మీద మూవీకి వస్తున్న కలక్షన్స్ పైనా  ఈసినిమాకు సంబంధించి పడిన సెటైర్లు ఈమధ్య కాలంలో ఏటాప్ హీరోల సినిమాల పైన పడలేదు. ఈమూవీ రిలీజ్ అయి రేపటితో రెండు వారాలు అవుతోంది. ఇండస్ట్రీ వర్గాలకు ఈసినిమా నిర్మాతలు ఇస్తున్న లీకుల ప్రకారం ఈమూవీ ఇప్పటి వరకు 61 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసింది అని లీకులు ఇస్తున్నారు. 
What Ram Charan Said About Babai Pawan Kalyan At VVR Pre-Release
దీనితో ఒక ఫెయిల్యూర్ సినిమాకు ఈస్థాయిలో కలక్షన్స్ రావడం చరణ్ స్టామినాకు నిదర్శనం అంటూ చరణ్ అభిమానులు అతడిని ఆకాశానికి ఎత్తేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతూ హడావిడి చేస్తున్నారు. అంతేకాదు ఒక డిజాస్టర్‌ మూవీకి ఇలాంటి కలక్షన్స్ రావడం అరుదైన విషయం అనిఅంటూ మెగా పవర్ స్టార్ స్టామినాను ‘వినయ విధేయ రామ’ ప్రూవ్ చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

‘అజ్ఞాతవాసి’ లాంటి పవన్ కళ్యాణ్ మూవీ ఫెయిల్ అయి 50 కోట్ల లోపే గత ఏడాది కలక్షన్స్ తెచ్చుకుంటే ఫెయిల్యూర్ ను కూడ ఎదిరిస్తూ ‘వినయ విధేయ రామ’ కు వచ్చిన కలక్షన్స్ ను బట్టి బాబాయి ని అబ్బాయి క్రాస్ చేసినట్లే అంటూ ఫెయిల్యూర్ లో కూడ ఆనందాన్ని వెతుకుంటున్నారు చరణ్ అభిమానులు. దీనితో రెచ్చిపోయిన పవన్ అభిమానులు చరణ్ అభిమానులను టార్గెట్ చేస్తూ 90 కోట్లకు అమ్ముడైన ‘వినయ విధేయ రామ’ కేవలం 38 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అని అంటూ ఈమూవీ కలక్షన్స్ అన్నీ బోగస్ లెక్కలు అంటూ మరొక ప్రచారానికి తెర తీస్తున్నారు. దీనితో రెండు ఫెయిల్యూర్ సినిమాల మధ్య కొనసాగుతున్న రికార్డుల రగడ అనవసరంగా చరణ్ పవన్ అభిమానుల మధ్య చివరకు చిచ్చుగా మారింది..



మరింత సమాచారం తెలుసుకోండి: