అక్కినేని అఖిల్ ‘మిస్టర్ మజ్ను’ కు వస్తున్న తొలి రిపోర్ట్స్ అఖిల్ కు జోష్ ఇస్తున్నా ఆ రిపోర్ట్స్ లోని కొన్ని అంశాలు మాత్రం అఖిల్ కు ఊహించని షాక్ ఇస్తున్నాయి అనడంలో సందేహం లేదు. తన కెరియర్ కు సంబంధించి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు ‘మిస్టర్ మజ్ను’ ఓవర్సీస్ టాక్ మంచి ఉత్సాహాన్ని ఇస్తోంది. 
Mr Majnu Theatrical Trailer
ఈసినిమాను చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు అఖిల్ పై ప్రశంసలు కురిపిస్తూ తాతకు తగ్గ మనవడు తండ్రికి పోటీ ఇచ్చే కొడుకు అంటూ ప్రశంసలు కురిపిస్తూనే ఈమూవీలో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ పై కూడ అఖిల్ తో సమానంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు మరికొందరైతే మరో అడుగు ముందుకు వేసి ఈసినిమా చూసిన సగటు ప్రేక్షకుడు ఖచ్చితంగా నిధి అగర్వాల్ గురించి మాట్లాడుకుంటారని ఈమూవీలో ఆమె లుక్స్ అదుర్స్ అంటూ ఒకవైపు అఖిల్ ను పొగుడుతూనే సరి సమానంగా నిధి అగర్వాల్ పై కూడ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
Mr Majnu is Character Best Movieer
మరికొందరైతే అఖిల్ కు స్టార్ మెటీరియల్ ఏర్పడింది అని కామెంట్ చేస్తూ క్రేజీ హీరోయిన్ గా రానున్న రోజులలో నిధి అగర్వాల్ సక్సస్ అవ్వడం ఖాయం అంటూ వెంకీ అట్లూరి డైలాగ్స్ ఈమూవీకి ప్రాణం పోసాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనితో ‘మిస్టర్ మజ్ను’ సక్సస్ ఫలితం కేవలం అఖిల్ కు మాత్రమే సొంతం కాకుండా అతడితో సమానంగా నిధి అగర్వాల్ కు కూడ బాగా కలిసి వస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
మిస్టర్ మజ్ను ట్రైలర్ టాక్.. కచ్చితంగా వేరే సినిమా గుర్తొస్తుంది...
సంక్రాంతి సినిమాల హడావిడి ముగిసి పోవడం ఈసినిమాకు పోటీ ఇచ్చే మరే సినిమా వచ్చే వారం కూడ లేకపోవడంతో పాటు ఈమూవీ బడ్జెట్ కూడ చాల తక్కువగా ఖర్చు పెట్టిన నేపధ్యంలో ఈమూవీకి ఒక మాదిరిగా కలక్షన్స్ వచ్చినా చాలు అఖిల్ కోరుకున్న హిట్ దక్కినట్లే. అయితే మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సగటు ప్రేక్షకుడి తీర్పు ఈమూవీ పై రావడానికి మరికొన్ని గంటలు పట్టే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: