'ఎఫ్ 2' సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న వరుణ్ తేజ్  కలిసి వస్తున్నకాలానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరో సినిమాను వెంటనే లైన్ లో పెట్టేసాడు. 14 రీల్స్ బ్యానర్  పై హరీష్ శంకర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న చిత్రం 'వాల్మీకి' ప్రారంభోత్సవం ఈ రోజు ఉదయం రామానాయుడు స్టూడియోలో జరిగింది. వరుణ్ తేజ్ కెరీర్లో 9వ చిత్రంగా ప్రారంభం అయినా ఈమూవీ మొదటి షాట్ చిత్రీకరణకు  నిహారిక క్లాప్ ఇచ్చింది. 
డిఫరెంట్ చిత్రాలు ఎంచుకుంటూ...
అయితే ఈ మూవీకి నిహారిక క్లాప్ ఇవ్వడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. గతంలో వరుణ్ తేజ్ సినిమాల ప్రారంభోత్సవంలో నిహారిక పాల్గొన్న చిత్రాలన్నీ సూపర్ హిట్ అయిన సందర్భంలో ఆ సెంటిమెంట్ ను కొనసాగించడానికి ప్రత్యేకంగా నిహారికను పిలిచినట్లు టాక్. తమిళంలో హిట్టయిన ‘జిగర్తాండ' కు ఇది రీమేక్ అని తెలుస్తోంది. తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈమూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.  
తమిళ చిత్రానికి రీమేక్
తమిళంలో  సిద్దార్థ్ హీరోగా నటించిన ఈమూవీకి  తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రెండు సంవత్సరాల క్రితం అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాథమ్' తీసి ఫెయిల్యూర్ తెచ్చుకున్న హరీష్ శంకర్ అనేక ఒడుదుడుకులు ఎదుర్కున్న తరువాత నిర్మిస్తున్న మూవీ ఇది. ప్రస్థుతం వరుణ్ తేజ్ లక్ బాగున్నా హరీష్ శంకర్ అదృష్టం బాగాలేదు కాబట్టి నిహారిక సెంటిమెంట్ ను ప్రయోగించారు అనుకోవాలి. 
వాల్మీకి
బోయవాడైన వాల్మీకి ఋషిగా మారి రామాయణం వ్రాసినట్లుగా అదే వాల్మీకి పేరును ఈమూవీ హీరోకి పెట్టి హరీష్ శంకర్ ఎంతవరకు సక్సస్ సాధిస్తాడో చూడాలి. డిఫరెంట్ కథలు లేకుండా సినిమాలు హిట్ కాని నేపథ్యంలో కేవలం ఈమూవీలోని టైటిల్ డిఫరెన్స్ తో పాటు కథలో కూడ వైవిధ్యం ఉంటుందో లేదో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: