సంక్రాంతిని టార్గెట్ చేస్తూ విడుదలలైన ‘ఎఫ్ 2’ వరల్డ్ వైడ్ గా 69కోట్ల షేర్ సాధించి దూసుకు పోతోంది. ప్రస్తుతం ఈసినిమాకు వస్తున్న కలెక్షన్స్ నిన్న ఆదివారంనాడు కూడ అత్యంత భారీగా రావడంతో ఈవీకెండ్ కలక్షన్స్ కు మరో రెండురోజులు కలక్షన్స్ కలిస్తే టాప్ హీరోలు నటించిన ‘జైలవకుశ’ ‘జనతాగ్యారేజ్’ ‘దువ్వాడ జగన్నాధమ్’ ‘అత్తారింటికి దారేది’ ‘సరైనోడు’ ‘శ్రీమంతుడు’ రికార్డులు ఎగిరిపోతాయి అన్నప్రచారం జరుగుతోంది.
15 రోజుల్లో వచ్చిన లాభం ఎంత?
అలాంటి పరిస్థితి నిజంగా జరిగితే మనతెలుగు రాష్ట్రాలలో ‘ఎఫ్ 2’ టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది అనిఅంటున్నారు. తెలుస్తున్న సమాచారంమేరకు నిన్న ఆదివారం సెలవురోజు కావడంతో ఈమూవీకి మరోరెండు కోట్ల నెట్ షేర్ వచ్చి ఉంటుంది అన్నఅంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈమూవీకి కొనసాగుతున్న కలక్షన్స్ సునామి ఈవారం కూడ ఇలాగే కొనసాగితే ఈమూవీకి కేవలం మన తెలుగురాష్ట్రాలలోనే 67కోట్ల  షేర్ వచ్చి ఈమూవీ టాప్ 5 లోకి చేరిపోయే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది అనిఅంటున్నారు. 
 à°à°°à°¿à°¯à°¾à°µà±ˆà°œà± షేర్
ఇప్పటికే ఈసినిమా విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ రికార్డులను దాటేసిన నేపధ్యంలో ఈమూవీ ఇండస్ట్రీ టాప్ 5 మూవీస్ లిస్టులో చేరడం పెద్ద కష్టంకాదు అని అంటున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాకు డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడికి ఇప్పటికే 200 శాతం లాభాలు కేవలం 15రోజుల్లో వచ్చాయి అన్నవార్తలు వస్తున్నాయి.
ఇంకెన్ని రికార్డులో...
ఈసినిమాను పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు అన్నిఖర్చులు పోను అప్పుడే 34కోట్ల లాభం వచ్చింది అనే వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఓవర్సీస్ లో కూడ ఈమూవీకి ఇదే మ్యానియా కొనసాగుతూ శనివారం రాత్రితో ఈమూవీ 2 మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిపోయింది అన్నవార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఓవర్సీస్ లో అత్యధికంగా వసూలు చేసిన ఆల్ టైమ్ టాప్ 10 తెలుగు చిత్రాల జాబితాలో ‘ఎఫ్ 2’ నిలిస్తుంది అని వార్తలు వస్తూ ఉండటంతో ఈమ్యానియా ఇలాగే కొనసాగి  ఈమూవీ కలక్షన్స్ ఏస్థాయికి చేరుతాయి అన్నవిషయం ఎవరికీ అర్ధం కావడంలేదు. అంతటితో ఆగకుండా ఈమూవీ ఏకంగా చరణ్ పవన్ రికార్డులను బ్రేక్ చేయబోతూ ఉండడంతో ఈవిషయం మెగా కాంపౌండ్ కే షాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: