కేథరీన్ థెరిసా.. ఆ మధ్య సరైనోడు సినిమాలో పొగరుబోతు ఎమ్మెల్యేగా అలరించిన ఈ భామ.. ఇటీవల తెలుగు తెరకు బొత్తిగా నల్లపూస అయ్యింది. ఇంతకీఇప్పుడేం చేస్తోంది అంటారా.. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన అత్తారింటికి దారేదీ తమిళ్ రీమేక్‌లో నటిస్తోంది.



ఐతే.. కేథరీన్ తెరీసా ఇప్పుడో హాట్ హాట్ యాడ్ లో అలరిస్తోంది. ప్రఖ్యాత సౌందర్య ఉత్పత్తుల సంస్థ పామోలీవ్ కోసం ఆమె నటించిన యాడ్ హాట్ హాట్ గా ఉండి ఆమె అందాలను ఆరబోస్తోంది. చక్కటి ప్రకృతి సౌందర్యాల మధ్య చిత్రీకరించిన ఈ యాడ్ ఆమె ఫ్యాన్స్‌ కు ఐ ఫీస్ట్ గా మారింది.


అసలే అందాల కేథరీన్ అందులోనూ.. బాత్ డ్రెస్‌లో.. ఇక అందాల ఆరబోతకు అడ్డేముంది.. ఓ అందమైన జలపాతంలో ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలతో ఈ యాడ్ చిత్రీకరించారు. ఎదపై వరకూ టవల్ చుట్టుకుని ఆమె స్నానం చేస్తున్న వీడియో సౌందర్యారాధకులకు సెగలు పుట్టించేలా ఉంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఈ వీడియోకు లక్షల సంఖ్యలో లైకులొచ్చేశాయ్. ఈ వీడియో వీక్షించి తరించిన ఫ్యాన్స్ కింద కామెంట్లలో తమ అభిమానాన్ని ఒలకబోశారు. అందాల కేథరీన్ కు పామోలివ్ సోప్ తో అవసరమేముంది.. ఆమె ముందుగానే చాలా అందగత్తె అంటూ కొందరు పొగిడేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: