తెలుగు ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారు.  ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు గా నిర్మిస్తున్నారు.  సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది.  ఎన్నో అంచనాల మద్య సంక్రాంతి బరిలో దిగిన బాలయ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో మిశ్రమ స్పందన వచ్చింది.  ఈ చిత్రంలో కేవలం బాలకృష్ణ గెటప్స్ కోసమే తీశారని..పాటలతోనే  అంతా కవర్ చేశారని విమర్శలు వినిపించాయి. 
Related image
దాంతో ఈ చిత్రం కలెక్షన్ల పై కూడా ప్రభావం పడింది.  మొదటి భాగం 'కథానాయకుడు' రిలీజ్ సమయంలో రెండు భాగాలు కలిపి కట్ చేసిన ట్రైలర్ ని వదిలారు.  ఆడియో ఫంక్షన్ కూడా ఒకటే ఉంటుందని అన్నారు. ఇక రెండో భాగం కూడా త్వరలో రిలీజ్ అయిన చెప్పినా..ఎన్టీఆర్ కథానాయకుడు ప్రభావం ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు'పై అంచనాలు పెంచడానికి చిత్రబృందం చాలా ప్రయత్నాలు చేస్తోంది.  ఈ చిత్రంలో కొన్ని కొత్త సీన్లు యాడ్ చేస్తున్నట్లు సమాచారం.
Image result for ntr kathanayakudu
అంతే కాదు  కూడా ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూస్తున్నారట. ఇప్పటికిప్పుడు సినిమా విడుదల చేస్తే 'కథానాయకుడు' ప్రభావం పడే ఛాన్స్ ఉందని భావిస్తోన్న  యూనిట్ ఫిబ్రవరి 14 లేదా 15 వీలైతే మూడో వారంలో   చిత్రం విడుదల చేయాలని అనుకుంటున్నారు.  మరి ఎన్టీఆర్ మహానాయకుడైనా బాలయ్యను ఆదుకుంటాడో లేదో చూడాలి.  చిత్రం


మరింత సమాచారం తెలుసుకోండి: