ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమాన్ని తీసుకు వచ్చింది నటి శ్రీరెడ్డి.  ఇండస్ట్రీలోకి ఎవరైనా కొత్త నటీమణులు రావాలంటే కొంతమందికి కమిట్ మెంట్ (పడక సుఖం) ఇస్తేనే పని అవుతుందని లేదంటే ఇండస్ట్రీలో ఎంత టాలెంట్ ఉన్న వారికి చోటు దక్కదని సంచలన వ్యాఖ్యలు చేసింది.  తాను కూడా కొంత మంది సినీ పెద్దల విషయంలో ఇలాగే మోసపోయానని..నాలాగే ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీలోని దళారుల చేతిలో మోస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.  

Related image

కాస్టింగ్ కౌచ్ పై పోరాటానికి సిద్దమైన శ్రీరెడ్డి కి మహిళాసంఘాలు, విద్యార్థి సంఘాలు, జూనియర్ ఆర్టిస్టుల సంఘాలు తోడయ్యాయి.  కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఉద్యమం మద్యలోనే ఆపేయాల్సి వచ్చింది.  ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నైలో ఉంటూ సోషల్ మీడియాలో కాస్టింగ్ కౌచ్ పోరాడుతుంది.  ఇక భారతీయ సినీ ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం మొదలైంది.  బాలీవుడ్ లో తనూశ్రీ దత్తా, కంగనా రౌనత్ పలువురు నటీమణులు..దక్షిణాదిన సింగర్ చిన్మయి మీ టూ ఉద్యమం ద్వారా కొంత మంది భాగోతాలు బయటపెట్టారు. 

Related image

 తాజాగా మోడల్, నటి షెర్లిన్ చోప్రా బాలీవుడ్ లో డిన్నర్ అనే పదానికి కొత్త అర్థం వివరించింది.  ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..నటీమణులను దర్శకులు, నిర్మాతలు అప్పుడప్పుడు డిన్నర్ కు పిలుస్తుంటారు. వాళ్లు పిలుస్తున్నది భోజనానికి అనుకుంటే పొరపాటు..దాంతో పాటు శారీరక సుఖం కోసం పిలుస్తున్నారనే విషయాన్ని గ్రహించాలి. నాకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.  

Image result for tanu sri dutta KANGANA

తాను అవకాశాల కోసం దర్శకులు లేదా నిర్మాతల వద్దకు వెళ్లినప్పుడు వారు డిన్నర్ కి పిలిచేవారని, మొదట అర్థం కాకపోయినా..తర్వాత వారి అంతరంగం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ప్రతిభ కలిగిన దర్శకులు, నిర్మాతలనే కలుసుకోవాలని నిర్ణయించుకున్నా.  గ్రామీణ, పట్టణాల నుంచి ఎంతో ఆశతో నటులుగా మారాలని వచ్చే అమ్మాయిలకు ఇలాంటి ఛేదు అనుభవాలు బాగా జరుగుతుంటాయని చెప్పుకొచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: