పవన్ కళ్యాణ్ రాజకీయాల బాటపట్టి సినిమాలకు దూరం కావడంతో పవన్ వీరాభిమానులు మెగా హీరోల సినిమాలతోనే సంతృప్తి పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో రేణు దేశాయ్ అకిరా నందన్ గురించి షేర్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది. ఈ లేటెస్ట్ ఫోటోను షేర్ చేస్తూ అకిరా నందన్ లుక్ ఎలా ఉంది అని ప్రశ్నించడంతో ఆ ఫోటోకు పవన్ అభిమానుల నుండి విపరీతమైన స్పందన వచ్చి జూనియర్ పవర్ స్టార్ అంటూ విశేష స్పందనతో సమాధానాలు ఇచ్చారు. 

అయితే ఆమధ్య రేణు దేశాయ్ అకిరాను జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ఇష్టం లేదని అంటూ పవన్ అభిమానుల కోపానికి గురైంది. అంతేకాదు అకిరా తన సొంతంగా గుర్తింపు తెచ్చుకోవాలని జూనియర్ పవర్ స్టార్ అనే పిలుపు పవన్ కు కూడ నచ్చదు అంటూ కామెంట్స్ చేసింది. అయితే ఆమె మాటలను లేక్కచేయకుండా పవన్ అభిమానులు  అకీరాలో పవన్ ను  చూసే విషయంలో ఎటువంటిమార్పు లేదు అన్న విషయం ఈ సంఘటన రుజువు చేస్తోంది. 
 
ఈఅభిప్రాయాలు ఎలా ఉన్న అకిరా లేటెస్ట్ ఫోటోలు చాలా బావున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అకీరానందన్ క్యూట్ అండ్ స్టైలిష్ లుక్ తో అదరగొడుతూ హెడ్ సెట్ పెట్టుకుని ఉన్న అకిరా నేటితరం యూత్ కు బాగా కనెక్ట్ అవుతున్నాడు. మరో ఫొటోలో అకిరా తన తల్లి రేణు దేశాయ్ తో కనిపిస్తూ తన తల్లికంటే ఎత్తుగా కనిపిస్తున్న నేపధ్యంలో పవన్ పొడుగు అకిరానందన్ కు పూర్తిగా వచ్చేసింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

పోలికల విషయంలో కూడ అకిరా లేటెస్ట్ ఫోటోను చూసినవారికి స్పష్టమైన పోలికలు కనిపిస్తూ ఉండటంతో కొందరు పవన్ వీరాభిమానులు అకిరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది అంటూ జోష్ తో కామెంట్స్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం తన తల్లి వద్ద పూణేలో ఉంటున్న అకిరా నందన్ కు సినిమాలు అంటే ఇష్టం లేదని ఆమధ్య పవన్ తన సన్నిహితులతో అన్నట్లు టాక్. అయితే తన ఫోటోకు వస్తున్న ఈవిపరీతమైన స్పందనను చూసి అకిరా తన అభిప్రాయాలు మార్చుకుంటాడెమో చూడాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: