తెలుగు లో వస్తున్న ఓ ప్రముఖ ఛానల్ ద్వారా పరిచయం అయిన బిత్తిరి సత్తి (కావలి రవి) తనదైన యాస, అమాయకత్వం, పంచ్ డైలాగ్స్ తో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే ఆ ఛానల్ లో బిత్తిరి సత్తికోసం చూసేవారే ఎక్కువ ఉన్నారంటే అతిశయోక్తి లేదు.  మిమిక్రీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని పదిహేను సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడ్డాడు..కానీ ఏదీ కలిసి 2012 లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ రియాలిటీ షోలో పాల్గొన రవి వివిధ ఛానల్స్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.

  ఆ తర్వాత తీన్మార్ న్యూస్ ఛానల్ లో బిత్తిరి సత్తిగా పరిచయం అయి..బాగా పాపులారిటీ సంపాదించాడు.  ప్రస్తుతం బుల్లితెరపైనే  కాదు వెండి తెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు.  బిత్తిరి సత్తి నటన మాత్రమే కాదు..మంచి సింగర్ అని కూడా పలుమార్లు రుజువు చేసుకున్నాడు.  తాజాగా జరిగిన 'దిక్సూచి' ఆడియో ఆవిష్కరణలో పాల్గొని, ఈ చిత్రంలో తాను ఆలపించిన ఓ పాటను పాడిన బిత్తిరి సత్తి, ఆహూతులతో అదుర్స్ అనిపించాడు. ద్మనావ్ భరధ్వాజ్ రచించిన పాటకు రాచూరి నరసింహ రాజు స్వరకల్పన చేయగా, బిత్తిరి సత్తి పాడాడు.
Image result for bithiri sathi
"మట్టిలోన మట్టిరా దేహమన్నది... వీర్యము కణమై కడుపున పడుతూ, నెలనెల ఎదిగిన ఓ శిశువా... తనువే తొడిగి, భువిలో పడుతూ తెలియని పుట్టుక నీదికదా.. పూర్వజన్మాల స్మృతిని, మరిచిపోయావు మానవా... మాయనిన్నావరించి, నడక నేర్చావు మెల్లగా..." అంటూ సాగిన ఈ పాటలో బిత్తిరి సత్తి తన విశ్వరూపం చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిత్తిరి సత్తి పాట పాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: