ఎన్టీఆర్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా ఆ సినిమా పంపిణీదారులకు భారీ నష్టాలే మిగిల్చింది. ఈ విషయం ఇప్పటికే ప్రముఖంగా వచ్చినా అదంతా నెగిటివ్ ప్రచారం అని ఆ సినిమా వర్గాలు సమర్థించుకున్నాయి. కానీ ఇప్పుడు తెలుగులోని ప్రముఖ పత్రిక కూడా ఎన్టీఆర్ నష్టాలను మిగిల్చిందని తేల్చి చెప్పింది.


ఎన్టీఆర్‌’కి మంచి ఓపెనింగ్స్‌ లభించినా బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకోలేకపోయిందని ఆ పత్రిక విశ్లేషించింది. ఎన్టీఆర్‌గా బాలయ్య అభినయాన్ని, క్రిష్‌ దర్శకత్వ ప్రతిభని మెచ్చుకున్నా ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదని తెలిపింది. మొత్తంగా చూస్తే పంపిణీదారులకు ఈ చిత్రం నష్టాన్నే మిగిల్చింది అని అసలు విషయం చెప్పేసింది.

ఇక రామ్‌చరణ్‌ - బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ‘వినయ విధేయ రామ’ అంచనాల్ని తలకిందులు చేసిందని విశ్లేషించింది. కథ కథనాలలో కొత్తదనం కనిపించకపోవడం, యాక్షన్‌ సన్నివేశాల్లో లాజిక్కులు మిస్సవ్వడం ఈ చిత్రానికి శాపంగా మారాయని అభిప్రాయపడింది. విడుదలకు ముందు దాదాపు రూ.వంద కోట్ల బిజినెస్‌ చేసిన ఈ చిత్రం, అందులో సగం కూడా రాబట్టుకోలేదని సదరు ప్రముఖ పత్రిక తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: