తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నట వారసులుగా నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చారు.  మాస్, క్లాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు.  ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  నాగ చైతన్య ఇప్పటికే పది సంవత్సరాలు కెరీర్ పూర్తి చేసుకోగా ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్.  ఈ చిత్రంలో అఖిల్ నటన, డ్యాన్స్, ఫైట్స్ కి మంచి మార్కులు పడ్డా..కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు.  ఆ తర్వాత హలో చిత్రంలో వచ్చాడు..ఇది కూడా కమర్షియల్ హిల్ కాలేదు. 
Related image
గత శుక్రవారం వెంకి అట్లూరి దర్శకత్వంలో ‘మిస్టర్ మజ్ను’చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  ఈ చిత్రం కూడా మిశ్రమ స్పందన వచ్చింది.  ఇక ఇండస్ట్రీలో చైతూ, అఖిల్ చిత్రాలపై నాగార్జున కమాండింగ్ ఎక్కువ ఉంటుందని.. మూవీస్ విషయంలోను కేర్ తీసుకుంటూ వుంటారు. దాంతో ఈ ఇద్దరి కెరియర్ ను నాగార్జున పూర్తిస్థాయిలో కంట్రోల్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.  అయితే చైతూని క్లాస్ హీరోగా..అఖిల్ ని మాస్ హీరోగా చేయడానికి నాగార్జున ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపించింది. 
Related image
తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ.. చైతూకి .. ఇటు నాకు తొలి అడుగుల సమయంలో నాన్న వెంటే ఉండటం వలన అలా అనిపించిందేమో. కానీ ఇప్పుడు అలా కాదు..కథపై తమకు మంచి పట్టు వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటున్నామని..నిజానికి ఆయన మా కెరియర్ ను కంట్రోల్ చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. తనవంతుగా సలహాలు, సూచనలు ఇస్తారంతే..మాకు అన్ని విషయాల్లో పూర్తి స్వేచ్ఛ ఇస్తారని అన్నారు.  నాన్న సినిమాల్లో 'హలో బ్రదర్' .. 'మన్మథుడు'  నచ్చుతాయి. ఇక 'పుష్పక విమానం'లో అమ్మ నటన నచ్చుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: