తెలుగులో విజయవంతమైన నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు పళ్లు రాలిపోతాయంటున్నారు.. ఈ మాట ఎవరిపైనో ఆగ్రహంతో ఆయన చెప్పడం లేదు. ఆయన మాట్లాడుతున్నది అచ్చంగా తన పళ్ల గురించే.. అవును.. ముందూ వెనుకా చూసుకోకుండా గెలుపుపై ధీమాగా ఉంటే పళ్లు రాలటం తప్పదంటున్నారు దిల్ రాజు.

Related image


ఇంతకూ ఈ డిబేట్ ఎందుకు వచ్చిందంటారా.. ఎఫ్‌ 2 సక్సస్ గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఒక్కోసారి విజయాలు వరుసగా వస్తుంటాయని.. కానీ అన్నిసార్లూ విజయం మనదే అనుకోవడం మంచిది కాదని ఆయన కామెంట్ చేశారు. 2017 ఏడాదిలో తమ సంస్థ నుంచి వచ్చిన ఆరు సినిమాలూ విజయవంతం కావడాన్ని ఆయన గుర్తు చేసుకున్నాడు.

Image result for dil raju f2


కానీ అన్నిసార్లూ అలా విజయం వస్తుందని లెక్కలు వేసుకుంటే ఒక్కోసారి పళ్లు రాలతాయని కామెడీగా అన్నారు. ఎఫ్ టూ విజయంపై మంచి జోష్ మీద ఉన్న దిల్ రాజు.. అదే జోరులో ఎఫ్‌ 3 కోసం కూడా ప్లాన్ చేస్తున్నాడు. వెంకటేశ్, వరుణ్ జోడీకి అదనంగా రవితేజను కూడా యాడ్ చేసే ఆలోచనలో ఉన్నాడు.

Related image

ఈ ఎఫ్ 3 సినిమా 2021 సంక్రాంతికి వచ్చే అవకాశం ఉందని దిల్ రాజు చెబుతున్నారు. ఏడాదికి నాలుగు నుంచి ఆరు సినిమాలు తీయాలని భావిస్తున్నట్టు దిల్ రాజు చెప్పారు. తమిళంలో హిట్ అయిన 96 సినిమాను రీమేక్ చేస్తున్నామని.. తమ సంస్థ చేస్తున్న తొలి రీమేక్ ఇదే అన్నారు దిల్ రాజు.


మరింత సమాచారం తెలుసుకోండి: