క్రిష్ అఖిల్ తో ఒక మూవీ చేయడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించాడు అని వచ్చిన వార్తలు క్రిష్ అభిమానులకు తీవ్ర కలవరపాటును కలిగిస్తున్నాయి. దీనితో ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తో తీవ్ర అపవాదులు కొని తెచ్చుకున్న క్రిష్ ను అఖిల్ వైపు వెళ్ళవద్దు అంటూ అతడికి అభిమానులు సందేశాలు పంపుతున్నట్లు టాక్.

‘మణికర్ణిక’ కోసం క్రిష్ ఎంతో కష్టపడి ఆమూవీకి పనిచేసినా చివరి నిముషంలో కంగనా రనౌత్ తో వచ్చిన అభిప్రయభేదాలతో ఆమూవీ ప్రాజెక్ట్ నుండి క్రిష్ బయటకు రావడంతో ఇప్పుడు ‘మణికర్ణిక’ సక్సస్ అంతా కంగనా ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఈసినిమాకు 70 శాతం వరకు పనిచేసింది తాను మాత్రమే అంటూ క్రిష్ బహిరంగంగా చెపుతున్నా అతడి పరిస్థితి అరణ్య రోదనగా మారింది.

ఇలాంటి పరిస్థుతులలో విజయం వచ్చిన సినిమాకు క్రెడిట్ దక్కక మరొక వైపు ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ అంతా క్రిష్ ఖాతాలోకి వచ్చి చేరుతున్న నేపధ్యంలో ఈవిచిత్ర పరిస్థుతులలో చిక్కుకున్న క్రిష్ కు కనీసం సానుభూతి చూపించే వ్యక్తులు కూడ కరువయ్యారు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పరాజయాలకు చిరునామాగా మారిన అఖిల్ తో సినిమాను చేయడం ఏమంత మంచిది కాదు అన్న అభిప్రాయాలు క్రిష్ అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి పరిస్థుతులలో క్రిష్ తన అభిమానులు చెపుతున్న సలహాలకు తల ఒగ్గి అఖిల్ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటాడ లేకుంటే నాగార్జున బలవంతంతో అఖిల్ వైపు అడుగులు వేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో క్రియేటివ్ దర్శకుడుగా పేరుగాంచి మంచి సినిమాలు తీయగల క్రిష్ కు ఇదేమి పరిస్థితి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: