ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక సరికొత్త అధ్యాయం సృష్టించాలి అని ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ సిద్ధాంతాలను అదేవిధంగా తన పార్టీ గుర్తును జనంలోకి తీసుకెళ్లడానికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇప్పటికే ఈ ప్రచారం నిమిత్తం ప్రచార రథాలు కూడ సిద్ధం అయ్యాయి. 

‘ఆమ్ ఆద్మీ’ పార్టీ తెచ్చుకున్న చీపురుకట్ట లాంటి కామన్‌ మాన్‌ కి కనెక్ట్ అయ్యే గాజు గ్లాసు గుర్తును జనంలోకి తీసుకు వెళ్ళడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు పవన్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పవన్ రకరకాల డ్రస్ కోడ్స్ అదేవిధంగా హెయిర్ స్టైల్స్ లో తేడాలు చూపెడుతూ జనం తన గెటప్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే విషయంలో పవన్ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. 

లాల్చీ పైజమా నుంచి వైఎస్ పంచెకట్టు దాకా కాస్ట్యూమ్స్ మారుస్తూ మధ్యలో  నల్ల చొక్కా ఎర్ర తువ్వాలుతో కూడా తాను సామాన్యులలో ఒకడిని అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమధ్య పవన్ జగన్ మధ్యకు వెళుతున్నప్పుడు అతడు లేటెస్ట్ గా గళ్ళ చొక్కా మెళ్ళో తాయెత్తుతో కనిపిస్తున్న గెటప్ పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.  

తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ కు అత్యంత సన్నిహితుడైన ఒక జ్యోతిష్కుడి సలహాతో పవన్ ఇప్పుడు ఈ తాయత్తును వేసుకున్నట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. నేషనల్ మీడియా సర్వేలలో పవన్ జనసేన ప్రస్తావన కూడ లేని పరిస్థుతులలో ఈ తాయత్తు మహిమతో  ‘జనసేన’ కు ఏవిధంగా జవసత్వాలు వస్తాయో వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: