ఈ మద్య ఇతర భాష చిత్రాలు తెలుగు లో డబ్ అవుతూ మంచి విజయాన్నే అందుకుంటున్నాయి.  ఇక తమిళ చిత్రాలకు తెలుగు లో మంచి ఆదరణ ఉన్న విషయం తెలిసిందే.  ఆ మద్య రెమో చిత్రంతో  తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌.  కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.  తాజాగా శివ కార్తికేయన్ ‘సీమరాజా’గా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 
Image result for సీమరాజా
పొన్‌రమ్‌ దర్శకుడు. ఆర్‌.డి. రాజా సినిమాను నిర్మించారు. గత ఏడాది సెప్టెంబరులో తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది.  ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఇందులో శివ కార్తికేయన్‌ తన అద్భుతమైన నటనతో మెప్పించారు. సమంత పవర్‌ఫుల్‌ పాత్రలో సందడి చేశారు. ఆమె కత్తిసాము చేసే సన్నివేశం హైలైట్‌గా నిలిచింది.
Siva Karthikeyan Seemaraja Trailer Released - Sakshi
సిమ్రన్‌ ఈ సినిమాలో ప్రతినాయకురాలి ఛాయులున్న పాత్రను పోషించినట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబరులో తమిళంలో విడుదలైన ఈ సినిమా మంచి హిట్‌ అందుకుంది.ఫిబ్రవరి 8న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: