ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ షూటింగ్ హైదరాబాద్ చివరిలో ఉన్న ఒక ప్రాంతంలో షూటింగ్ జరుపు కుంటోంది. ఈమూవీ షూటింగ్ ను చలిని కూడ లెక్కచేయకుండా రాజమౌళి ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మొదలు పెట్టి షూటింగ్ విషయంలో ఒక్క నిముషం వృధా చేయకుండా చాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు సంబంధించిన కథ ఫైనల్ అయినా ఈమూవీలో నటిస్తున్న చరణ్ జూనియర్ ల హీరో పాత్రలకు సంబంధించిన వాటాల విషయంలో సమతుల్యం జరగకపోవడం రాజమౌళిని కలవర పెడుతున్నట్లు టాక్. ఈసినిమా కథ 1940 ప్రాంతానికి అదేవిధంగా 2019 ప్రాంతానికి చెందిన రెండు భాగాలుగా ఉండటంతో చరణ్ జూనియర్ ల పాత్రలకు సంబంధించి ప్రాముఖ్యత విషయంలో సమస్యలు ఏర్పడుతున్నట్లు సమాచారం. 

ఈసినిమాకు సంబంధించిన 1940 కాలం నాటి కథలో చరణ్ జమిందారుగా కనిపిస్తే జూనియర్ పేదవాడుగా కనిపిస్తాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. ఇక ప్రస్తుత కాలానికి సంబంధించిన ఈసినిమా కథలో జూనియర్ ధనవంతుడుగా కనిపిస్తే చరణ్ పేదవాడుగా కనిపిస్తాడు అంటూ లీకులు వచ్చాయి. కానీ వాస్తవానికి ఈసినిమాకు సంబంధించిన 2019 కాలం నాటి కథలో జూనియర్ చరణ్ లు అన్న దమ్ములుగా కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇలా ఈసినిమా కథ ఫ్లాష్ బ్యాక్ తో పాటు వర్తమానానికి కూడ సంబంధించి ఉండటంతో ఈ కథలో జూనియర్ చరణ్ లకు సమాన ప్రాముఖ్యత ఇవ్వడం రాజమౌళికి కష్టంగా అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎదో ఒకచోట జూనియర్ చరణ్ పాత్రలలో ఎదో ఒక పాత్రకు ప్రాముఖ్యత వస్తున్న నేపధ్యంలో ఈ రెండు పాత్రలను ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటూ రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ తో తెగ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక చివరకు రాజమౌళి ఈమల్టీ స్టారర్ స్టోరీని ఎలా బ్యాలెన్స్ చేస్తాడు అన్న ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలలో పెరిగిపోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: