పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లో 2001 లో వచ్చిన ‘ఖుషీ’ ఒక సంచలనం. ఆతరువాత ఆసినిమా నిర్మాత ఏఎమ్ రత్నంకు పవన్ కు మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆతరువాత కొన్ని సినిమాలు వచ్చినా ఆసినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. 
ఆ భాద్యత తేజకు
వరసపెట్టి వచ్చిన పరాజయాలతో ఆర్ధిక సమస్యల మధ్య ఇరుక్కున్న ఏఎమ్ రత్నంను ఆదుకుంటానని పవన్ మాట ఇవ్వడంతో ‘కాటమరాయుడు’ నిర్మాణ సమయంలో ఏఎమ్ రత్నం పవన్ కాంబినేషన్ తో ఒక సినిమాను ప్రకటించడమే కాకుండా ఆసినిమా ప్రారంభోత్సవం కూడ జరిగింది. అప్పట్లో ఈసినిమాకు సంబంధించి భారీ మొత్తాన్ని అడ్వాన్స్ గా పవన్ తీసుకున్నాడు అన్న వార్తలు కూడ వచ్చాయి. 
బాగా తగ్గించారు
అయితే ఆతరువాత ఏర్పడిన పరిస్థుతులలో పవన్ తన ఆసలన్నీ ‘అజ్ఞాతవాసి’ పై పెట్టుకోవడం ఆమూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో పవన్ కు సినిమాలు అంటే విరక్తి కలిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనితో పవన్ రాజకీయాల బాట పట్టడమే కాకుండా ఇక పూర్తిగా సినిమాలకు దూరం అన్న సంకేతాలు వచ్చాయి. అయితే పవన్ దగ్గర ఏఎమ్ రత్నం ఇచ్చిన అడ్వాన్స్ తో పాటు మరో మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు ఇచ్చిన అడ్వాన్స్ లు ఉన్నాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనితో పవన్ తిరిగి ఇవ్వవలసిన ఆ అడ్వాన్స్ లెక్కల బాధ్యతలను సాయి ధరమ్ తేజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 
చిత్రలహరితో బిజీగా
ప్రస్తుతం సినిమాలు లేక బాధ పడుతున్న తేజ్ ఏఎమ్ రత్నం పవన్ కు ఇచ్చిన అడ్వాన్స్ నిమిత్తం ఒక సినిమాను ఎటువంటి పారితోషికం లేకుండా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈమూవీ త్వరలోనే ప్రారంభం అవుతుందని టాక్. ఇలాగే మరో రెండు నిర్మాణ సంస్థ అడ్వాన్స్ లు కూడ పవన్ వద్ద ఉన్నాయి కాబట్టి వాటికి బదులుగా తేజ్ తన మామయ్యా మాట నిలబెట్టడం కోసం సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఏమైనా సినిమాలు లేని పరిస్థుతులలో తేజ్ కు గతంలో పవన్ తీసుకున్న అడ్వాన్స్ లు అదృష్టంగా మారినట్లు కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: