నాని మార్కెట్ అతడి సినిమాలు వరసపరాజయం చెందినా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ‘జెర్సీ’ మూవీకి 35కోట్ల బిజినెస్ అవ్వడం నానీ మార్కెట్ స్టామినాకు నిదర్శనం అంటూ ఇండస్ట్రీ వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఈమధ్య కాలంలో నానీ నటించిన రెండు సినిమాలు వరస పరాజయం చెందినా ఈస్థాయిలో ‘జెర్సీ’ కి మార్కెట్ జరగడం వెనుక గతంలో అతడి సినిమాలు వల్ల విపరీతమైన లాభాలు పొందిన బయ్యర్ల క్రేజ్ అని అంటున్నారు. 

అయితే ప్రస్తుతం నానీకి ఎంత మార్కెట్ ఉన్నా అతడి సినిమాల బడ్జెట్ కు సంబంధించి మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తే నాని కెరియర్ కు విపరీతమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ రావడం వెనుక గల కారణం నాని త్వరలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు మైత్రీ మూవీస్ సంస్థ 50కోట్లు ఖర్చు పెట్టబోతోంది అని వార్తలు రావడం.

సాధారణంగా విక్రమ్ కుమార్ సినిమాలకు విమర్శల ప్రశంసలు లభిస్తాయి కానీ కలక్షన్స్ విషయంలో పెద్దగా ఫలితాన్ని చూపించలేవు. అయితే ఈవిషయాలను పట్టించుకోకుండా విక్రమ్ కుమార్ తాను తీయబోతున్న సినిమాలో నానీని మూడు డిఫరెంట్ గెటప్స్ తో చూపెడుతూ మరో ప్రయోగం చేస్తూ ఈమూవీకి కథరీత్యా 50కోట్ల బడ్జెట్ అవసరమని చెప్పి మైత్రి మూవీస్ ని ఒప్పించినట్లు తెలుస్తోంది. 

తన సినిమాకు విక్రమ్ కుమార్ పెంచుతున్న భారీ బడ్జెట్ విషయాలను తెలుసుకుని నాని ఈసినిమాకు ఆస్థాయిలో ఖర్చు పెట్టవద్దని విక్రమ్ కుమార్ కు సలహాలు
ఇస్తున్నా అతడు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దీనితో ఈసినిమాకు పెరిగిన బడ్జెట్ రీత్యా కనీసం 60కోట్ల వరకు మార్కెట్ జరగవలసిన పరిస్థుతులలో ఆస్థాయిలో మార్కెట్ జరగాలి అంటే ‘జెర్సీ’ ఘన విజయం సాధించవలసిన పరిస్థుతులు ఏర్పడిన నేపధ్యంలో ‘జెర్సీ’ ఫలితంలో అనుకోకుండా తేడాలు వస్తే ఆతరువాత వెనువెంటనే వచ్చే విక్రమ్ కుమార్ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ నాని తెగ టెన్షన్ పడిపోతూ విక్రమ్ కుమార్ కు సద్దిచెప్పలేక సతమతమై పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: