‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్నా ఆతరువాత నాగచైతన్యకు కనీసపు హిట్ కూడ లేకపోవడంతో ప్రస్తుతం అతడి పరిస్థితి అయోమయంగా మారిపోయింది. హ్యాట్రిక్ ఫ్లాప్ లతో కొనసాగుతున్న ఈ అక్కినేని యంగ్ హీరోను కాపాడగలిగిన సమర్ధత ప్రస్తుతం వెంకటేష్ సమంతల పైనే ఆధారపడి ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 
Naga Chaitanya-Samantha's second look poster of 'Majili' unveiled
ప్రస్తుతం నాగచైతన్య శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ‘మజిలీ’ ఈ సమ్మర్ రేస్ కు రాబోతోంది. పెళ్ళి అయిన తరువాత సమంతా నాగాచైతన్యలు వెండితెర పై భార్య భర్తలుగా కనిపించబోతున్న ఈమూవీ ఒక డిఫరెంట్ స్టోరీతో అల్లబడిన కథ క్రికెట్ అంటే ఇష్టం లేని భార్యకు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టం ఉండే భర్తకు మధ్యన ఏర్పడిన ఒక భేధాభిప్రాయాల మధ్య ఒక టీనేజ్ అమ్మాయి వీరిద్దరి జీవితాల మధ్యకు రావడంతో ఏర్పడే సమస్యలు చుట్టూ అల్లబడిన ఈకథ పై మంచి అంచనాలు ఉన్నాయి.
Naga Chaitanya to Star in 'Premam' Remake?
అయితే రాబోతున్న సమ్మర్ లో క్రికెట్ నేపధ్యంలో నాని ‘జెర్సీ’ తో పాటు ఇంకా చాల సినిమాలు రాబోతున్నాయి. దీనితో ఇన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాల మధ్య ఏ సినిమాకు ఓటు వేస్తారు అన్న విషయమై చైతన్యకు టెన్షన్ పెరుగుతోందని టాక్. ఒకవేళ అనుకోకుండా ఈమూవీ కూడ ఫెయిల్ అయితే ఇక చైతన్యను రక్షించ వలసింది అతడి మేనమామ వెంకటేష్ మాత్రమే. 

స్టార్ తనయుడి కష్టాలు అన్ని ఇన్ని కావు..!
దర్శకుడు బాబి దర్శకత్వంలో వెంకటేష్ నాగచైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ స్క్రిప్ట్ కు ‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత అనేక మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈమూవీలో వెంకటేష్ పాత్రను పెంచడమే కాకుండా జాతకాల పై విపరీతమైన నమ్మకం ఉండే వెంకటేష్ పాత్ర చుట్టూ కామెడీ సీన్స్ పెంచడమే కాకుండా ఈమూవీలో చైతన్య పాత్ర విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈమూవీని వేగంగా పూర్తి చేసి అన్నీ కుదిరితే ఆగష్టు నెలాఖరున విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు సినిమాల ఫలితం బట్టి నాగచైతన్య కెరియర్ ఆధారపడి ఉంటుందనీ  దీనితో చైతన్యను ముంచినా తేల్చినా వెంకటేష్ సమంతలదే బాధ్యత అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: