రాజమౌళి తన సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు తన కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా హీరోయిన్స్ నుండి డిమాండ్స్ ఎదుర్కోవడం రాజమౌళిని ఆశ్చర్య పరుస్తున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఈముగ్గురిలో ఖచ్చితంగా ఒక బాలీవుడ్ హీరోయిన్ ను ఎంపిక చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ ఉద్దేశ్యమే రాజమౌళికి ఊహించని టెన్షన్ గా మారిందని అంటున్నారు. 
rrr launch
తెలుస్తున్న సమాచారం మేరకు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ విషయమై అలియా భట్ ప్రణితి చోప్రాలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరూ రాజమౌళికి పెడుతున్న కండిషన్స్ మాత్రం ఏకంగా జక్కన్న మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి అని అంటున్నారు. ఈమూవీలో నటించడానికి వీరిద్దరూ అంగీకరిస్తూనే డేట్స్ విషయంలో వీళ్ళు పెడుతున్న కండిషన్స్ తో పాటు ముఖ్యంగా పారితోషిక విషయంలో వీరిద్దరూ రాజమౌళికి చుక్కలు చూపెడుతున్నట్లు టాక్. 

అలియా భట్ 6 కోట్ల పారితోషికం అడిగితే ప్రణితి చోప్రా 4 కోట్లు పారితోషికం అడగడమే కాకుండా వారి సహాయకుల కోసం కూడ భారీ ప్యాకేజీలు అడుగుతున్నట్లు సమాచారం. దీనితో ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాను తీసిన రాజమౌళికి కూడ హీరోయిన్ కష్టాలు తప్పడం లేదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి హీరోలకు భారీ పారితోషికాలు ఇచ్చే విషయంలో ఎటువంటి రాజీపడని రాజమౌళి తన సినిమాలలో నటించే హీరోయిన్స్ పారితోషికం విషయంలో అంత భారీగా ఉండడు అని అంటారు. దీనితో రాజమౌళికి ఇలాంటి కండిషన్స్ హీరోయిన్స్ నుంచి రావడం అతడి కెరియర్ లో ఇదే మొదటిసారి అని అంటున్నారు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఒక ప్రత్యేకమైన చెక్ పోస్ట్ సెట్ లో పోలీసు పాత్రలో నటిస్తున్న చరణ్ వందమంది రౌడీలను చితకొట్టే భారీ సీన్స్ ను చిత్రీకరిస్తున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ మొదలైన తరువాత ఇప్పటి వరకు షూటింగ్ స్పాట్ లో జూనియర్ లేకుండా ఒక్కరోజు కూడ షూటింగ్ జరగని పరిస్థుతులలో నిన్నటి నుంచి మాత్రం జూనియర్ లేకుండానే ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కొనసాగింప బడటం ఒక కొస మెరుపు అని అంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: