హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు గుండె సంబంధ సమస్య ఏర్పడటంతో వైద్యులు ఆయనకు సర్జరీ నిర్వహించిన సంగతి తెలిసిందే. సర్జరీ పూర్తయి హైదరాబాద్ చేరుకున్న బ్రహ్మానందంను నిన్న అల్లు అర్జున్ బ్రహ్మి ఇంటికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా ఈ విషయాన్ని బన్నీ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా వెల్లడిస్తూ ‘రియల్ ఐరన్ మ్యాన్ ఆయన గుండె చాలా స్ట్రాంగ్.. దానికి నవ్వించడమే తప్ప భయం తెలియదు. మా కిల్ బిల్ పాండేను కలవడం సంతోషంగా ఉంది.' అంటూ ట్విట్ చేశాడు. 
Allu Arjun
అంతేకాదు తాను బ్రహ్మీని కలిసిన సందర్భానికి సంబంధించిన ఫోటోను కూడ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసాడు. ఇప్పుడు ఈఫోటో అల్లు అర్జున్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయటపెట్టింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు త్వరలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీలో బన్నీ సన్నగా కనిపించకుండానికి బాగా డైటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
naa peru surya naa illu india first day box office collections
దీనితో త్వరలో బాగా సన్నబడ్డ బన్నీని చూడబోతున్నాము అంటూ బన్నీ అభిమానులు కలలు కన్నారు. అయితే ఈ అంచనాలకు భిన్నంగా అల్లు అర్జున్ ఏమాత్రం సన్నంగా కనిపించకుండా ఎప్పటిలాగే కనిపించడంతో డైటింగ్ చేసినా బన్నీ లావు తగ్గలేదా అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. మరికొందరైతే ఈపరిస్తుతులలో త్రివిక్రమ్ సినిమా మరింత ఆలస్యం అవుతుంది అంటూ ఊహాగానాలు కూడ చేస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా త్రివిక్రమ్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ కు అల్లు అర్జున్ బాగా మార్పులు చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ కళ్యాణ్ కూడ తనను స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి ప్రశ్నలు వేయకుండా స్వేచ్ఛ ఇచ్చిన పరిస్థుతులలో తనకు ఇలాంటి పరిస్థితి ఏమిటి అంటూ త్రివిక్రమ్ మధన పడుతున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: