ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్. రెహమాన్ వివాదాలకు దూరంగా ఉంటాడు. తాను పనిచేసే సినిమాల సంగీతానికి సంబంధించిన వ్యవహారాలు తప్ప ఇండస్ట్రీ రాజకీయాల గురించి అతడు ఎప్పుడూ పట్టించుకోడు. అలాంటి రెహమాన్ ఈమధ్య అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకుని అతడి విమర్శకుల దగ్గర నుండి విపరీతమైన కామెంట్స్ ఎదుర్కొన్నాడు. 
రెహమాన్ అలాంటివాడు
ఇక వివరాలలోకి వెళితే రెహమాన్ కు ఆస్కార్ అవార్డ్ ను తెచ్చిపెట్టిన స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్ విడుదలై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ప్రత్యేక కార్యక్రమం ఈమధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ కుమార్తె ఖతీజా కూడా హాజరైంది. సాధారణంగా సినిమా కార్యక్రమాలకు రెహమాన్ ఎప్పుడూ తన కుటుంబ సభ్యులను తీసుకురాక పోవడంతో మీడియా దృష్టి అంతా రెహమాన్ కుమార్తె పైనే పడింది.
నిజాలు తెలుసుకోండి
అయితే ఖలీజా ఎంతో భావోద్వేగంగా మాట్లాడుతూ తన తండ్రి గొప్పతనం గురించి వివరించి ప్రశంసలు పొందినా ఆమె ఆకార్యక్రమానికి సాంప్రదాయ బద్ధంగా తయారై బుర్ఖా ధరించి రావడంతో ఆమె లుక్ ను చూసి చాలామంది షాక్ అయ్యారు. అంతేకాదు ఇంత సంకుచిత ఛాందశ భావాలతో  రెహమాన్ తన కూతురును పెంచుతున్నందుకు తప్పు పడుతూ రెహమాన్ ను టార్గెట్ చేస్తూ చాలామంది విమర్శలు చేస్తున్నారు. 

దీనితో పెరుగుతున్న విమర్శలను గ్రహించిన ఖలీజా తనకు తానుగా మీడియాకు వివరణ ఇచ్చింది. తమ కుటుంబం అంతా సాంప్రదాయంగా ఉంటుందని ఈ విషయానికి కూడ వివాదం చేస్తారని తాను అనుకోలేదని అంటూ ఘాటైన స్పందన ఇచ్చింది. తాను సాంప్రదాయంగా ఆ ఫంక్షన్ కు రావడం వెనుక తన తండ్రి ఒత్తిడి లేదని అంటూ ప్రతి విషయంలోనూ తమ ఇష్టానికి అనుగుణంగా తన తండ్రి తనను పెంచిన విషయాన్ని అందరికీ తెలిసి వచ్చేలా క్లారిటీ ఇచ్చింది. వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలను మన్నించడం సంస్కారం అని తెలిసి కూడ కేవలం ఒక వ్యక్తి వేసుకున్న దుస్తుల పై సెటైర్లు వేసేవారికి రెహమాన్ కూతురు ఇచ్చిన సమాధానం చెంపపెట్టు అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: