వైఎస్ రాజశేఖరరెడ్డి అనగానే తెల్లని దోవతి దానిపై దరించే పొడవైన చొక్కా మల్లెపూవు లాంటి చల్లనినవ్వు సాధారణంగా ఇదీ ఎవరినైనా సహజంగా స్వాగతం అంటూ పలకరిస్తున్నారా! అన్నట్లుండే ఆయన బాహ్యస్వరూపం. ఇలా ఎవరు కనిపించినా ఖచ్చితంగా గౌరవం ఇచ్చేస్తాం! కారణం సాధారణ తెలుగుదనం అది.

సంబంధిత చిత్రం

ఈ సినిమా-యాత్రలో వైఎస్‌ రాజ‌శేఖ‌రరెడ్డి (వైఎస్ఆర్) పాత్ర‌లో మళయాళ నటుడైనా మ‌మ్ముట్టి అట్టే ఒదిగిపోయారు. వైఎస్ఆర్ లా క‌నిపించ‌క‌టానికి ఆయన ఏ మాత్రం ప్రయత్నించలేదు కాని ఆయన ఆహార్యం దాన్ని మించిన ఆత్మను ఒడిసి పట్టేశారు. బాహ్య స్వరూపం సునాయాసంగా స్వతం చేసుకున్నారు.

సంబంధిత చిత్రం

కాని ఆయన అంతఃసౌంధర్యాన్ని అర్ధం చేసుకొని వాటితో వైఎస్ఆర్ ఆత్మకు అనుసంధానమై భావోద్వేగాలను నిండుగా పండించారు. ఏ మాత్రం వైఎస్ఆర్ హావ‌భావాల్ని అనుక‌రించ‌కుండా ఆ పాత్ర ఆత్మ‌ని తనలోకి పరకాయ ప్రవేశం చేసుకొని న‌టించారు. ఆయ‌న సొంతంగా సంభాష‌ణ‌లు చెప్పిన విధానం కూడా ఆక‌ట్టుకుంటుంది. సినిమాలో సహజ ఆహార్యం, సెంటిమెంట్‌, భావోద్వేగాలు పండించటంలో మ‌మ్ముట్టి కృతకృత్యుడవ్వటం ఆపై నటించిన తీరు కృత్రిమం అనిపించలేదు సరికదా! ప్రేక్షకుల ముందు వైఎస్ఆర్ హృదయావిష్కరణ చేసినట్లైంది.

YSR MammooTTy yatra pictures కోసం చిత్ర ఫలితం

నిజంగా చెప్పాలంటే ట్రైలర్ చూసిన ప్రతి తెలుగువాడు ఒక్కసారి వైఎస్ఆర్ ను చూసొద్ధాం అనుకున్నారు తప్ప, ఆయన బయోపిక్ చూసొద్ధం అనుకోలేదు. అయినా ఇది తెలుగువారి ఆరాధ్య నాయకుడి సంపూర్ణ జీవన చిత్రం కూడా కాదు! రాజకీయ జీవితంలో పాదయాత్ర అనే కీలక ఘట్టం మాత్రమే.


ఎన్టీఆర్ కథానాయకుడులో ఆయన సతీమణి బసవతారకం సహజ గృహిణి. ఆ స్వభావాన్ని ఆత్మను అర్ధం చేసుకొని ఆమెను అనుకరించే అవసరం లేదు. ఎందుకంటే ప్రేక్షకులకు ఆమె పెద్దగా తెలియదు. అయితే గంపెడు సంతానమున్న ఒక కుటుంబ గౌరవాన్ని ధరించిన భరించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన విద్యా బాలన్ ఆ పాత్రకే ఔచిత్యం తెస్తే - ముమ్ముట్టి మాత్రం ఔచిత్యమున్న పాత్రలో అంతే స్థాయిలో సంలీనమై నటించారు.

YSR MammuTTy yaatra pictures కోసం చిత్ర ఫలితం

అంతవరకు నాయకులు తాము ఎలా ప్రజాసేవ చెయ్యాలి, అంతకంటే నాయకుడుగా తామెలా ఉండాలి - అన్న స్థాయి నుండి పాదయాత్రలో ఎదిగి ప్రజల అవసరాలను వారి దగ్గరికెళ్ళి సమీపం నుండి వీక్షించే సమయంలో వారి కష్టాల నుండి సమస్యల నుండి ప్రభావితమౌతూ కొంతసేపు మెదడును ప్రక్కనపెట్టి హృదయంతో ఆలోచించి ఆ ఉద్వేగాలతో వైఎస్ఆర్ రాజకీయ నాయకుడి నుండి ప్రజానాయకుడిగా పరివర్తన చెందటం ఒక అద్భుత కీలకాంశం. ఆదే సినిమాలో అద్భుతంగా పండింది.


అనుభవం వైఎస్ఆర్ స్వంతమైతే - ఆయన ఆత్మను అర్ధం చేసుకొని తిరిగి వెండితెరపై అచ్చుగుద్దినట్లు బావోద్వేగాలను అనుభూతితో  స్వంతం చేసుకొని ఆవిష్కరించారు మమ్ముట్టి. అందుకే ఆ పాత్రలో ఆత్మ ఉంది. ఉద్వేగం ఉంది భావం ఉంది ఆహార్యం ఉంది. అందుకే ప్రేక్షకుల మనసును కట్టి పడేసి వీక్షకులకు తన్మయత్వం ప్రసాధించారు.

సంబంధిత చిత్రం

సహజ పాత్ర సామర్ధ్యం ఎంతగా ఉందో అంతే సహజంగా అంటే బింబానికి సరైన ప్రతిబింబావిష్కరన నూరుపాళ్లు జరిగింది. వై ఏస్ ఆర్ ఆత్మ స్వరూపావిష్కరణతో అందరూ- శత్రువులు సైతం-ఇన్స్పైర్ అయి చూస్తారనటంలో ఏమాత్రం అనుమానం లేదు.


అక్కడ విద్యా బాలన్ నటించినట్లే  మమ్ముట్టి అంతఃకరణ శుద్ధిగా నటించి వైఎసార్ ను పునరావిష్కరించారు. 

vidyabalan as basavatarakam కోసం చిత్ర ఫలితం

"ఊళ్లో పది మందికే నెలకి డెబ్బయ్‌ అయిదు రూపాయల పించను వస్తోంది. ఆ పదిమంది లో ఒకరు పోతే మనకి ఆ డబ్బులొస్తాయని మరొకరి చావు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది" లాంటి పేదరికం, దాని దయనీయతపై కదిలించే సంభాషణలు హృదయాన్ని కదిలిస్తాయి.

YSR MammooTTy yatra pictures కోసం చిత్ర ఫలితం

మరో సన్నివేశంలో మాట్లాడలేకపోతున్నానని అంటున్న రైతు ఆత్మఘోష అర్ధం చేసుకుంటున్న వైఎస్ఆర్ తో అతను మాట్లాడలేడు అని డాక్టర్‌ వివరించబోతే, కలతచెందిన మనసు తో నాకు వినబడుతోందయ్యా! అంటూ అటు డాక్టర్ కు - ఇటు నేను విన్నాను, నేనున్నాను అంటూ రోగిగా మరిన రైతుకి,  ప్రక్కనున్న ఇతరులకు భరోసా ఇవ్వడం వైఎస్ఆర్ సహజశైలి యాత్ర సన్నివేశాల్లో చక్కని మెలోడ్రామాతో అదేస్థాయిలో మమ్ముట్టి రి-ప్రొడుస్ చేసేశారు. నేను పార్టీకి విధేయుణ్ణే కాని...బానిసను కాదు...ఇది వైఎస్ హృదయావిష్కరణమే. ఇంకా ఎన్నో విషయాలు. 


ఇక ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ లో  ప్రధాన పాత్రలో నటించిన పాత్రధారి ఆత్మజుడే (కుమారుడు) అయినా – ఆ పాత్రకు ఆ ఆత్మకు అనుసంధానం జరగకపోవటమే ఆ సినిమా సజీవం కాకపోవటానికి కారణం  –  సినిమా లో సహజ ఆహార్యం, సెంటిమెంట్‌, భావోద్వేగాలు పండించటంలో ఆత్మజుడు నటించినా- కృత్రిమత్వం సంతరించుకుంది   బహు విచిత్రం. అంతా అనుకరణేగాని ఆత్మసాక్షాత్కారమేది! సినిమా నిండా రికార్డింగ్ డాన్సులే! అదే ప్రధాన భేదం.

ముఖ్యంగా సినిమా అంతా కీలక పాత్రకు అద్ధిన దర్శకత్వ ప్రతిభె! 

(మిగతా…మరోసారి)

మరింత సమాచారం తెలుసుకోండి: