ముమ్ముట్టి నటించిన యాత్ర విజయం సాధించడంతో ఆ విజయం నుంచి బాలకృష్ణ నేర్చుకోవాలిసిన పాఠాలు చాలా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ నిర్మాణం నుంచి ప్రచారంలోకి వచ్చినా   మొదట్లో ఈ సినిమాను  వైసీపీ నేతలు కార్యకర్తలెవరూ విడుదల అయ్యేంత వరకు పట్టించుకోలేదు. ఎటువంటి  పొలిటికల్ టచ్ లేకుండానే ఈ సినిమా నిర్మాణం పూర్తి చేసుకుంది. యాత్రమూవీ ప్రమోషన్ కు రాజకీయ నాయకులెవరూ హాజరుకాలేదు సరికదా కనీసం జగన్ఆయన కుటుంబ సభ్యులు కూడ హాజర్ కాలేదు.  
తొలిభాగంలో
అంతేకాదు ఈమూవీ ప్రమోషన్ గురించి జగన్ ఎక్కడా మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే ఈమూవీ విడుదల అయి ఒక్కరోజు పూర్తి కాకుండానే సీన్ పూర్తిగా మారిపోయి ఈమూవీ తెలుగురాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నేతలు కార్యకర్తలు సినిమాకు విపరీతమైన ప్రచారం తీసుకువస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనేక జిల్లాలలో వైసీపీ ఎమ్మెల్యేలు ఫస్ట్ డే ఫస్ట్ షోకి తమ కార్యకర్తలు అందరినీ ఈమూవీ థియేటర్స్ వద్దకు పంపించి ఓపెనింగ్ కలెక్షన్స్ బాగా వచ్చేలా చూడటమే కాకుండా ఈమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దర్శకుడు మహీ వీ రాఘవ గురించి
అంతేకాదు వైఎస్ఆర్ పార్టీ కీలక నేతలు తమ అనుచరుల కోసం థియేటర్లలోని సీట్లన్నీ బుక్ చేయించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘యాత్ర’ మూవీకి మొదటిరోజు మొదటి షో నుండి వైఎస్సార్ అభిమానులు క్యూ కట్టారు. దీనికితోడు ఈసినిమాకు సినిమాకు పాజిటవ్ టాక్ రావడంతో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోవడంతో ‘యాత్ర’ థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది. 
 సెకండాఫ్‌లో
దీనికితోడు కొందరు సాధారణ ప్రేక్షకులు ఎన్టీఆర్ బయోపిక్ కి వైఎస్ఆర్ యాత్రకు తేడా తెలుసుకోవడం కోసం థియేటర్స్ కు వస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈమూవీలో భావోద్వేగాలు పరఫెక్ట్ గా పండటంతో ఈసినిమా సూపర్ హిట్ అయింది అని వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి టీడీపీ వర్గాలు హడావిడి చేసి చివరికి ఈ సినిమా విడుదల అయ్యాక  సినిమాకు డివైడ్ టాక్ రాగానే ఆసినిమా థియేటర్స్ వైపు కూడా వెళ్ళక పోవడంతో ఈమూవీ కలెక్షన్స్ రెండవరోజు నుండి పడిపోయి ఆతరువాత ఘోరమైన ఫ్లాప్ కు దారితీసింది. వాస్తవానికి తెలుగు దేశం పార్టీకి ఉన్న సుమారు 70 లక్షల క్రియాశీలక కార్యకర్తలు ఒక్కసారి ఎన్టీఆర్ బయోపిక్ ను చూసినా ‘కథానాయకుడు’ కి ఇలాంటి పరాభవం ఎదురై ఉండేది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనితో ‘యాత్ర’ బాలకృష్ణ కు ఎన్నో పాఠాలు నేర్పిన సినిమాగా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: