మరి కొన్ని రోజులలో రాబోతున్న వాలంటైన్స్ డే సందర్భంగా సాయి ధరమ్ తేజ్ పెట్టిన ట్వీట్ పై ఇప్పుడు తెగ సెటైర్లు పడుతున్నాయి. తాను ఎప్పుడూ సింగిల్ గానే ఉంటున్నానని మీ అందరి సింగిల్ స్టోరీస్ తనతో షేర్ చేసుకోండంటూ తేజ్ విసిరిన ఒక ఛాలెంజ్ ఇప్పుడు అందరి దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. మరికొందరైతే తేజ్ మరీ అమాయకత్వం నటిస్తూ అందర్నీ తప్పు దారి పట్టిస్తున్నాడు అంటూ జోక్స్ కూడ వేస్తున్నారు.
Sai Dharam Tej
కెరీయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ ఎప్పుడూ సింగిల్ కాదనేది అందరికీ తెలిసిన విషయం. సీజన్ కు తగ్గట్టు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చే తేజ్ వాలంటైన్స్ డే టైమ్ లో భలేగా నటిస్తున్నాడంటూ చాలామంది అతడిని ట్రోల్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు గత వాలంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నావో మరిచిపోయావా అంటూ మరికొందరు గతాన్ని గుర్తుచేస్తున్నారు.
Sai Dharam Tej Wiki
వాస్తవానికి తేజ్ లవ్ ఎఫైర్ల పై ఎప్పటికప్పుడు గాసిప్స్ వినిపిస్తూనే ఉంటాయి. దీనికితోడు ఆ మధ్య రకుల్ ప్రీత్ తేజ్ గురించి మాట్లాడుతూ అతడెప్పుడు సింగిల్ గా ఉండడు అంటూ షాకింగ్ సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. దీనితో ఈ మెగా మేనల్లుడుకి రాబోతున్న వాలంటైన్స్ డే రోజుకు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరకలేదేమో అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. 
Sai Dharam Tej Chitralahari Latest Update - Sakshi
ప్రస్తుతం పరాజయాల బాటలో పయనిస్తున్న తేజ్ కెరియర్ ను చక్కబెట్టే బాధ్యత చిరంజీవి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రామ్ చరణ్ కు తెలిసిన దర్శక నిర్మాతలను సాయి ధరమ్ తేజ్ కు అవకాశాలు ఇమ్మని చరణ్ ద్వారా వ్యూహాత్మక రాయబారాలు చేస్తున్నట్లు టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: